Summer Health Problems: జలుబు, గొంతు నొప్పి, వివిధ రకాల ఇన్‌ఫెక్షన్లు వేసవిలో కూడా వస్తుంటాయి. వేసవిలో ఎదురయ్యే ఇటువంటి చాలా సమస్యలకు ఇంటి చిట్కాలతోనే నియంత్రించవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వేసవి పీక్స్‌కు చేరింది. బయటి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వేడి చేయడం వల్ల జలుబు, గొంతునొప్పి సర్వసాధారణంగా కన్పిస్తున్నాయి. ఇక కడుపులో ఇన్‌ఫెక్షన్లు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. జలుబు నుంచి విముక్తి పొందేందుకు వేసవి కాలమైనా సరే..ఆవిరి పట్టడమే అత్యుత్తమ పరిష్కారం.


మీరు తినే ఆహార పదార్దాల్లో అల్లం ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే కడుపు నొప్పి, గొంతునొప్పి, తలనొప్పి వంటి సమస్యలకు అల్లం మంచి పరిష్కారం. కొన్ని అల్లం ముక్కల్ని నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగితే గొంతు నొప్పి సమస్య పోతుంది. ఇక గొంతు నొప్పికి మరో పరిష్కారం..ఉల్లిపాయలు, తేనె కలిపి తీసుకోవడం. చిన్న ఉల్లిపాయకు కొద్దిగా చక్కెర లేదా జామ్ పట్టించి తేనె వేసి రాత్రంతా మూతపెట్టి ఉంచాలి. ఉదయం ఆ ద్రవాన్ని తాగితే దగ్గు దూరమౌతుంది. వెల్లుల్లి ముక్కల్ని కొద్దిగా తేనె..నిమ్మరసంతో కలిపి గోరువెచ్చని నీటితో మిక్సీ చేసుకుని తీసుకోవాలి. ఇది కూడా గొంతునొప్పికి మంచి చికిత్స. 


విటమిన్ సి అధికంగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే జలుబు దరిచేరదు. ద్రాక్ష, నారింజ, నిమ్మకాయలు వేసవిలో ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఒంటికి చలవ చేయడమే కాకుండా విటమిన్ సి పుష్కలంగా అందిస్తాయి. ఇక వేసవిలో మీ బాడీ హైడ్రేట్‌గా ఉండేట్టు చూసుకోవాలి. సాధ్యమైనంతగా ఎక్కువ ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు, బార్లీ, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ వంటివి వేసవిలో ఆరోగ్యానికి మంచివి.


Also read: Pulses For In High Cholesterol: కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పప్పులు తినాలి..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook