Acne Problem: ముఖంపై మొటిమలు అనేది ప్రస్తుతం ఓ సాధారణ సమస్యగా మారింది. మొటిమల కారణంగా ముఖం అందవిహీనంగా మారుతుంది. బయటకు వెళ్లేందుకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే మొటిమలు రాకుండా ఉండాలంటే తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహిళలకే కాదు మగవారికి కూడా ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్నవారికి ప్రధానంగా ఎదురయ్యే సమస్య ముఖంపై మొటిమలు. వీటివల్ల మచ్చలు (Spots) ఏర్పడి ముఖం అందవిహీనంగా మారుతుంటుంది. నలుగురిలో వెళ్లాలంటే ఇబ్బంది కలుగుతుంది. అసలు ముఖంపై మొటిమలు రావడానికి కారణాలేంటి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుంటే మంచిది. మొటిమలు రాకుండా ఉండలాంటే చర్మ రక్షణ చాలా అవసరం. అంటే చర్మం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 


కలుషితమైన వాతావరణం, మనం నిత్యం తీసుకునే ఆహారంలో పోషక పదార్ధాల లోపం వల్ల చర్మం పొడిబారి మొటిమలు (Acne) ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖంపై మొటిమలకు ప్రధాన కారణం మన శరీరంలో నీటి శాతం తగ్గడమే. అందుకే శరీరానికి కావల్సినంత నీరు తీసుకుంటే చర్మం తాజాగా ఉంటుంది. ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల చర్మంలో పేరుకుపోయిన మలినాలు బయటకు పోతాయి. మొటిమలకు మరో ప్రధాన కారణం వివిధ రకాల సబ్బులు, ఫేస్‌వాష్‌లు. ఇందులో అధిక మొత్తంలో ఉండే రసాయనాలు ముఖాన్ని పొడిబారుస్తాయి. అందుకే చర్మ తత్వానికి అనుగుణంగా తగిన సబ్బులు, ఫేస్‌వాష్‌లు ఎంచుకోవాలి.


ముఖ్యంగా చర్మానికి తేమను అందించే సబ్బుల్ని ఎంచుకోవల్సి ఉంటుంది. వాతావరణంలో మార్పుల కారణంగా చర్మ రంధ్రాల్లో మలినాలు చేరి మొటిమలు ఏర్పడతాయి. కాబట్టి క్లెన్సింగ్, క్రబ్బింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కువగా ఎండలో తిరిగినా లేదా చలిలో తిరిగినా చర్మానికి హాని కలుగుతుంది. అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు..మాయిశ్చరైజర్ క్రీమ్స్ రాసుకోవాలి. ఇవి చర్మానికి తేమను అందించి..పొడిబారకుండా చేస్తాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి. అయితే చాలామంది నూనె ఆధారిత మాయిశ్చరైజింగ్‌లు ఎంచుకుంటారు. ఇది మంచిది కాదు. అందుకే నీరు లేదా జెల్ ఆధారిత మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఎంచుకోవడం మంచిది. చర్మానికి కొన్ని రకాల లేపనాలు వారానికి రెండుసార్లు రాసుకుంటే..చర్మానికి కావల్సిన పోషకాలు అంది చర్మం తాజాగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం కూ డా మొటిమలకు ప్రదాన కారణం. కనుక తీసుకునే ఆహారంలో ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి ఆహారం వల్ల ముఖంపై మొటిమలు ఏర్పడే అవకాశముంది. అందుకే ఇలాంటి ఆహార పదార్ధాలకు దూరంగా ఉండటం మంచిది.రాత్రి పడుకునేముందు ముఖానికున్న మేకప్ పూర్తిగా తొలగించి..మాయిశ్చరైజింగ్ క్రీమ్‌లు (Moisturising Creams) రాసుకుంటే చాలా మంచిది.


Also read: Corona Symptoms in Kids: కరోనా సోకిన పిల్లల్లో రెండు కొత్త లక్షణాలు- ముందే జాగ్రత్త పడండి!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.