Corona Symptoms in Kids: దేశంలో కరోనా మూడో వేవ్ నేపథ్యంలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. అటు రాజకీయ నాయకులతో పాటు అనేక మంది సినీ ప్రముఖుల్లోనూ అనేక మంది కొవిడ్ బారిన పడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మధ్య వయస్కుల వారిని భయాందోళనలకు గురిచేసిన ఈ కొవిడ్ మహమ్మారి.. ఇప్పుడు చిన్నారుపై కూడా ప్రభావం చూపుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా చిన్నారులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ బారిన పడుతున్నారు. మన వద్ద కూడా పిల్లల్లో కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒకటి రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
కొందరు చిన్నారులకు కడుపు నొప్పి రావడం సహా వాంతులు అవుతున్నాయి. జ్వరం, ఇతర సమస్యలు తక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది తల్లిదండ్రులు దీనిని అజీర్ణ సమస్యగా భావిస్తున్నారు. ప్రాథమిక వైద్యంతో కొందరిలో తగ్గిపోతోంది. మరికొందరు మాత్రం వైద్యులను సంప్రదిస్తున్నారు. పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది.
డెల్టా వేరియంట్‌లో పిల్లల్లో కడుపు నొప్పి కనిపించేది కాదని, అప్పట్లో వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు.
పిల్లల ఆరోగ్యం నిలకడగా..
ప్రస్తుతం సికిందరాబాద్ లోని గాంధీ ఆసుపత్రి పిల్లల వార్డులో అయిదుగురు చిన్నారులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి ఆక్సిజన్‌తో చికిత్స అందిస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101-102 డిగ్రీల జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించి పరీక్షలు చేయించాలని సూచిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
మూడోదశ వేగంగా వ్యాప్తి చెందుతుండటం వల్ల 5 ఏళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల్లో ఎక్కువ మంది మాస్క్ పెట్టుకోని నేపథ్యంలో పిల్లలు కరోనా బారిన పడుతున్నారని వైద్యులు అంటున్నారు. ఈ వయస్సు పిల్లలకు టీకాలు కూడా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ తరుణంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని చిన్న పిల్లల వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: India omicron Update: దేశంలో 'ఒమిక్రాన్' విజృంభణ... 5,488కి చేరిన కేసుల సంఖ్య..
Also Read: Omicron Latest Study: ఒమిక్రాన్ తాజా అధ్యయనంలో ఆందోళన కల్గించే అంశాలు, ప్రమాదకరమే మరి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.