Control Cholesterol: చలి కాలంలో మఖానా చేసిన డ్రింక్‌తో చెడు కొలెస్ట్రాల్‌కు ఇలా 15 రోజుల్లో చెక్ పెట్టొచ్చు..
How To Control Cholesterol: వివిధ రకాల అనారోగ్యకరమైన ఆహారాలను అతిగా తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించి వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
Makhana For Bad Cholesterol: చాలామందిలో శరీరంలో పోషకాలు లేనందున ఎప్పుడూ నీరసంగా ఉంటారు. కొందరైతే అన్ని రకాల ఆహారాలు తిన్నప్పటికీ నీరసంగా ఉంటారు. దీనికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారంలో తగినన్ని పోషక విలువలు లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరానికి దానికి కావాల్సిన పోషక విలువలు తగిన మోతాదులో అందకపోతే రక్త సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోషక విలువల కొరత వల్ల రక్తహీనత, శరీరంలో నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మ సమస్యలు, కండరాల బలహీనత, వేగంగా బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఇంకొందరు లోనైతే తీవ్రమైన ప్రాణాంతక వ్యాధులు కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే ఈ సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి.. ఆరోగ్య నిపుణులు సూచించిన ఈ క్రింది చిట్కాను వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా పై అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని పోషక విలువలు కలిగిన డ్రింక్స్ ను ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. అయితే శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు పై సమస్యలన్నీ దూరమయ్యేందుకు మఖానా చేసిన డ్రింక్స్ ని తాగాల్సి ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు, కార్బోహైడ్రేట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి.
మఖానా డ్రింక్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం:
ముందుగా మఖానా తీసుకొని వాటిని ఒక ఫ్యాన్ లో వేడిచేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో చిక్కటి పాలను వేసి ఓ పొంగొచ్చేవరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన పాలలో వేడి చేసి పెట్టుకున్న మఖానా వేసి కొద్దిసేపు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా బెల్లాన్ని వేయాల్సి ఉంటుంది. బెల్లాన్ని వేసిన తర్వాత ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించి. అందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసి సర్వ్ చేసుకోవాలి. ఇలా తయారుచేసిన డ్రింకును క్రమం తప్పకుండా తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాల కలుగుతాయి.
Also Read: Post Office Scheme: ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టండి.. భారీ లాభం పొందండి
Also Read: Prince OTT: 'ప్రిన్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి