Diabetes Tips: మధుమేహం వ్యాధి ప్రధానంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల సంభవిస్తుంటుంది. చాలామంది చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. ముఖ్యంగా కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతుంటాయి. అందుకే ఆహారపు అలవాట్ల విషయంలో మధుమేహం వ్యాధిగ్రస్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మధుమేహం వ్యాధిగ్రస్తులు ఎప్పుడూ డైట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నాన్‌వెజ్ విషయంలో కేర్ అవసరం. రెడ్ మీట్, ప్రోసెస్డ్ మీట్ అనేది మధుమేహం వ్యాధిగ్రస్థులకు విషం లాంటిది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. శరీరంలో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ పెరిగిందో వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే మధుమేహం వ్యాధిగ్రస్థులు వీలైనంతవరకూ శాకాహారం తీసుకోవాలి. కొన్ని రకాల వెజిటేరియన్ సూప్ తాగితే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. 


మష్రూం సూప్


మధుమేహం వ్యాధిగ్రస్థులు బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించుకోవాలంటే వెజిటేరియన్ సూప్స్ ఎక్కువగా తీసుకోవాలి. అందులో ముఖ్యమైంది మష్రూం సూప్. దీనికోసం ఒక కప్పు మష్రూం, ఒక కప్పపు గోధుమ పిండి , సగం కప్పు ఫ్యాట్ మిల్క్ , సగం కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు ఆయిల్ తీసుకోవాలి. అన్నింటినీ కలిపి ఓ గిన్నె నీటిలో వేసి 6-7 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడీ మిశ్రమంలో పాలు పోసి కలపాలి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని ఆయిల్ వేసి స్లో ఫ్లేమ్‌లో వండితే చాలు. 


టొమాటో సూప్


టొమాటో సూప్ తయారు చేయాలంటే ఒక కప్పు టొమాటో సూప్, అర కప్పు రెడ్ మిర్చి, ఒక వెల్లుల్లి తీసుకుని ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని అన్నింటినీ కలిపి వండాలి. మొత్తం మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేసి కలపాలి. రుచి కోసం బ్లాక్ సాల్ట్ కలిపి సర్వ్ చేయాలి. 


మసూర్ దాల్ సూప్


మసూర్ దాల్ సూప్ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మసూర్ దాల్, ఉల్లిపాయలు, క్యారట్, షిమ్లా మిర్చి కలిపి ఓ గిన్నె నీటిలో వేసి 10 నిమిషాలు వండాలి. చివరిగా కొద్దిగా ఉప్పు కలిపి సర్వ్ చేసుకుని తాగాలి. ఈ మూడు వెజిటేరియన్ సూప్స్ సేవిస్తే కచ్చితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండవచ్చు.


Also read: Detox Juices: ఆరోగ్యానికి మేలు చేసే డిటాక్స్ జ్యూస్‌లు ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook