COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

How To Control Diabetes Without Medicine: మధుమేహం కారణంగా శరీరంలోని అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తంలోని చక్కెర పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల ప్రాణాంతకంగానూ మరే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే మూత్రపిండాలు, చర్మం, గుండె, కళ్ళ సమస్యలు కూడా రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం అదుపులో ఉండడానికి తప్పకుండా జీవనశైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే ప్రాణాలకే ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి రక్తంలోని చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవాలనుకునేవారు తప్పకుండా కొన్ని హోమ్‌ రెమెడీస్‌ని వినియోగించాల్సి ఉంటుంది. 


ఒత్తిడికి దూరంగా ఉండడం చాలా మంచిది:
ఒత్తిడి బాధపడేవారు ఎంత తొందరగా తగ్గించుకుంటే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే మధుమేహం బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీని కారణంగా గ్లూకాగాన్, కార్టిసాల్ అనే రెండు హార్మోన్లు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. దీంతో రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒత్తిడి నియంత్రించుకోవడానికి వ్యాయామం, ధ్యానం, విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. 


నీటిని ఎక్కువగా తాగండి:
శరీరం యాక్టివ్‌గా ఉండడానికి శరీరానికి తగిన నీరు అవసరం..అయితే ప్రస్తుతం చాలా మంది నీటిని ఎక్కువగా తాగడం లేదు. నీటిని తీసుకోలేకపోవడం వల్ల కూడా మధుమేహం బారిన పడే ఛాన్స్‌లు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే మధుమేహం సమస్యలతో బాధఫడేవారు పడేవారు నీటిని ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. లేకపోతే రక్తంలోని చక్కెర పరిమాణాలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  


ఉసిరిని తప్పకుండా తీసుకోవాలి:
ఉసిరి రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో క్రోమియం అనే ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడుతున్నవారు ఉసిరిని పొడిలా తయారు చేసి తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 


వ్యాయామాలు:
మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు వ్యాయామాలు కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా వ్యాయామాలు చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపడి..రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. 


Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook