How To Control Diabetes: డయాబెటిస్ అనేది ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న వ్యాధి. కాబట్టి ఆధునిక జీవనశైలిలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు రక్తంలో చక్కెరను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది అనారోగ్యకరమైన ఆహారాలను విచ్చలవిడిగా తింటున్నారు. ఇలాంటి ఆహారాలు ప్రతి రోజూ తినడం వల్లే రక్తంలో చక్కెర పరిమాణాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. కాబట్టి ఈ పరిమాణాలను నియంత్రించుకోవడానికి ఇన్సులిన్‌ పరిమాణంలో మార్పులు చేర్పుల కోసం పలు ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆయుర్వేద గుణాలు కలిగిన అంజీర్‌ ఆకులను కూడా వినియోగించాల్సి ఉంటుంది. ఈ ఆకులను ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంజీర్‌ ఆకులను ఇలా వినియోగించండి:
అంజీర్‌ ఆకులను తాజాగా లేదా ఎండబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అద్భుతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి 4 నుంచి 5 అంజీర్‌ ఆకులను నీటిలో 10 నిమిషాల పాటు ఉడకబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది. కావాలంటే అంజీర ఆకులను ఎండబెట్టి పొడిలా తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటి ఆకును గ్రీన్‌ టీగా తాగడం వల్ల కూడా మంచి లాభాలు కలుగుతాయి.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్


ఎముకల బలహీనతకు చెక్‌:
ఎముకల బలహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అంజీర్‌ ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం లభించి చాలా ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా శరీర నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.


గుండె సమస్యలకు చెక్‌:
గుండె జబ్బులతో బాధపడేవారు అంజీర్‌ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఇందులో ఒమేగా-3, ఒమేగా 6 మూలకాలు లభిస్తాయి. కాబట్టి గుండెను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.


Also Read: Sekhar Master : తండ్రిని తలుచుకుంటూ కంటతడి.. యాంకర్ ప్రదీప్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook