Diabetes Drinks: మధుమేహం వ్యాధిగ్రస్థులు ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పరిశీలిస్తుండాలి. బ్లడ్ షుగ్ లెవెల్స్ పెరిగితే ఇన్సులిన్ వరకూ పరిస్థితి వెళ్లవచ్చు. ఇది తీవ్రమైన అనారోగ్య పరిస్థితికి కారణమౌతుంది. అయితే రోజూ ఉదయం ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా ఇన్సులిన్ అవసరం ఏర్పడదంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో నిమ్మకాయ పిండి తాగడం అలవాటు చేసుకుంటే మధుమేహం వ్యాధిగ్రస్థులకు అద్భుతంగా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రెష్‌గా ఉంచుతాయి. ఎనర్జీ అందిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే నిమ్మకాయ నీళ్లలో పంచదార కాకుండా తేనె కలపడం మంచిది. 


రెండవ అద్భుతమైన డ్రింక్ మెంతి నీళ్లు. మెంతి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో పంచదార సంగ్రహణాన్ని స్లో చేస్తుంది. రాత్రంతా మెంతి గింజల్ని నీళ్లలో నానహబెట్టి ఉదయం వాటిని నీళ్లతో సహా తాగాలి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 


మూడోది వెజిటబుల్ జ్యూస్. ఆకుపచ్చని కూరగాయల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో కేలరీలు, కార్బోహైడ్రేట్లు తక్కువ ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులకు మంచిది. పాలకూర, క్యారట్, దోసకాయ, బీట్‌రూట్ వంటి వాటితో జ్యూస్ చేసి తాగితే మంచి ఫలితాలుంటాయి. శరీరానికి కావల్సినంత పోషకాలు లబిస్తాయి. 


దాల్చిన చెక్క టీ కూడా మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు ఇన్సులిన్ సెన్సిటివిటీను పెంచుతాయి. ఫలితంగా రక్తంలో షుగర్ సంగ్రహణ నెమ్మదిస్తుంది. దాల్చిన చెక్క టీ రోజూ ఒకసారి తాగితే మంచి ఫలితాలు కన్పిస్తాయి. 


ఇక ఐదవ డ్రింక్ ఉసిరి జ్యూస్. ఇందులో విటమిన్ సి కావల్సినంతగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఫలితంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. 


Also read: Cholesterol Reducing tips: నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ వేగంగా కరిగించే ఫ్రూట్



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook