Cholesterol Reducing tips: నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ వేగంగా కరిగించే ఫ్రూట్

Cholesterol Reducing tips: శరీరంలో దాదాపు అన్ని రకాల సమస్యలకు మూలం కొలెస్ట్రాల్. ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్ కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 9, 2024, 05:59 PM IST
Cholesterol Reducing tips: నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ వేగంగా కరిగించే ఫ్రూట్

Cholesterol Reducing tips: రక్తంలో కొలెస్ట్రాల్ అవసరమే కానీ మోతాదు మించి ఉండకూడదు. ఒకవేళ మోతాదుకు మించితే వివిద రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రక్తపోటు, మధుమేహం, గుండె వ్యాధులు ఇలా అన్నింటికీ మూలం చెడు కొలెస్ట్రాల్. అసలు అయితే కొలెస్ట్రాల్ ఉంటే ట్యాబ్లెట్స్ వాడకుండానే కొన్ని పదార్ధాలు తీసుకోవడం ద్వారా సులభంగా తగ్గించుకోవచ్చు.

మనిషి శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ పరిమాణం 100 ఎంజీ దాటకూడదు. ఎక్కువయ్యే కొద్దీ రక్త నాళాల్లో బ్లాకేజ్ ముప్పు పెరుగుతుంది. దాంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకున్నప్పుడు కొన్ని సంకేతాలు స్పష్టంగా కన్పిస్తుంటాయి. వాంతులు, వికారం, సరిగ్గా పలకలేకపోవడం, అలసట, చేతులు కాళ్లు తిమ్మిరెక్కడం, ఛాతీలో నొప్పి, కంటి రెప్పలపై పసుపుగా పేరుకోవడం కన్పిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా డైట్ ప్రధాన భూమిక వహిస్తుంది. చెడు ఆహారపు అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ పేరుకుంటుంది. అందుకే హెల్తీ ఫుడ్ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. 

ఆపిల్ ఎ డే కీప్ డాక్టర్ ఎవే అని ఏ పరిస్థితుల్లో అన్నారో గానీ అక్షరాలా నిజం. రోజూ  ఆపిల్ తింటే కొలెస్ట్రాల్ చాలా సులభంగా తగ్గించేయవచ్చు. ఆపిల్‌లో ఉండే అద్భుతమైన పోషకాలు ఇందుకు ఉపయోగపడతాయి. ఇందులో కాపర్, విటమిన్ కే, విటమిన్ ఇ, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. రోజూ 2 ఆపిల్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పూర్తిగా తగ్గించవచ్చని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైంది. 

రోజుకొక ఆపిల్ తింటే గుండె రోగాలకు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే పేక్టిన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిస్తుంది. పోలీఫెనాల్ రక్తపోటును నియంత్రించి స్ట్రోక్ ముప్పుును తగ్గిస్తుంది. ఇందులో ఉండే అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అల్జీమర్ వ్యాధి ముప్పును చాలావరకూ తగ్గిస్తాయి.

Also read: Masked Aadhaar Card: మాస్క్డ్ ఆధార్ కార్డు అంటే ఏంటి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News