Thyroid Control Food: జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవడం వల్ల చాలా మంది తీవ్ర వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఈ క్రమంలో చాలా మంది థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడడం విశేషం. అయితే ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణాలు అధికంగా ఒత్తిడికి గురికావడమేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అనుసరించే జీవన శైలి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనిషి మానసికంగా, శరీరీకంగా బాగుంటే ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. అయితే ప్రస్తుతం చాలా మంది ఒత్తిడికి లోనవున్నారు. ఇలాంటి క్రమంలోనే థైరాయిడ్‌ హార్మోన్లలో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఒత్తిడి నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.


థైరాయిడ్ వ్యాధి వల్ల వంధ్యత్వ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ ఇలాంటి సమస్యలతో బాధపడే స్త్రీలు, పురుషులు పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధునిక జీవన శైలిని పాటించకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


తరచుగా జుట్టు రాలడం వంటి సమస్యలు ఉంటే థైరాయిడ్ లక్షణమేనని నిపుణులు సూచిస్తున్నారు.  జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడేవారు తప్పకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం చాలా మంచిది. లేకపోతే బట్టతల వంటి సమస్యలకు కారణాలు కావొచ్చు.


నిరంతర అలసట కూడా థైరాయిడ్ ప్రధాన లక్షణమని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారిలో శరీరంలో శక్తి లోపించి తరచుగా అలసిపోతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడతారు.


యూరిక్‌ యాసిడ్‌ సమస్యల కారణంగా కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులు వస్తూ ఉంటాయి. అయితే థైరాయిడ్‌తో బాధపడేవారిలో కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి కాళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.


Also read: Mangal Gochar 2023: మంగళ గ్రహ గోచారంతో హోలీ తరువాత ఆ 4 రాశులపై ఊహించని కనకవర్షం


Also read: Mangal Gochar 2023: మంగళ గ్రహ గోచారంతో హోలీ తరువాత ఆ 4 రాశులపై ఊహించని కనకవర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook