How To Cure Acidity: ఈ కూరగాయలతో పొట్ట సమస్యలన్నీ శాశ్వతంగా మటు మాయం..
Vegetable For Gas Acidity: చాలా మంది ఆధునిక జీవన శైలిని అనుసరించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొట్ట సమస్యలు సర్వసాధరణంగా మారాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఈ చిట్కాలను వినియోగించండి.
Vegetable For Gas Acidity: ఆధునిక జీవితంలో అన్ని సులువుగా మారుతున్నాయి. వ్యాధులు కూడా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. అయితే చాలామంది రన్-ఆఫ్-ది-మిల్ జీవితంలో భాగంగా శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. దీని కారణంగా చాలామంది కొత్త సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం వల్ల యాసిడిటీ, గ్యాస్ ఏర్పడడం వంటి సమస్యలు నిత్యం ఎదుర్కొంటూనే ఉంటున్నారు.
అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ వీటి నుంచి ఉపశమనం పొందలేకపోతున్నాను. ఈ సమస్యల నుంచి శాశ్వతంగా బయటపడడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన నాలుగు చిట్కాలను పాటించాలి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పచ్చిబఠానీలతో కూరగాయలు తినడం:
చాలామంది పచ్చిబఠానీలను వివిధ వంటకాల్లో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వీటిని విచ్చలవిడిగా వినియోగించడం వల్ల పొట్టలో గ్యాస్ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి యని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి వీటిని వంటకాలలో వినియోగించకపోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా బంగాళదుంప వండుకునే క్రమంలో చాలామంది వీటిని వినియోగిస్తారు. ఇలా వినియోగించడం శరీరానికి అస్సలు మంచిది కాదు.
సొరకాయలను ఆహారంలో వినియోగించడం:
గ్యాస్ సమస్యల నుంచి సులభంగా సులభంగా బయటపడడానికి సొరకాయలను ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్టలో మలబద్ధకం ఆసిడిటీ గ్యాస్ సమస్యలు సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతాయి. కాబట్టి తప్పకుండా ఆహారంలో సొరకాయను వినియోగించండి.
కాలేతో ఎసిడిటీ మాయం:
పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారికి ముఖ్యంగా గ్యాస్ ఎసిడిటీ సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కాలే ప్రభావంతంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేయడమే కాకుండా పొట్టలోని సమస్యలను సులభంగా నియంత్రించేందుకు సహాయపడతాయి. కాబట్టి తప్పకుండా మీరు దీనిని ఆహారాల్లో వినియోగించాల్సింది.
ఉదయాన్నే వెల్లుల్లి రెబ్బలు తినండి:
గ్యాస్-ఎసిడిటీతో బాధపడుతున్న వారికి వెల్లుల్లి ఔషధంగా పనిచేస్తుంది. ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఉదయాన్నే రెండు రెబ్బల వెల్లుల్లి తింటే శరీరానికి ప్రయోజనాలు కలవడమే కాకుండా గ్యాస్ సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా వెల్లుల్లి నుంచి రెట్టింపు ప్రయోజనాలు పొందడానికి.. వెల్లుల్లి రెబ్బలను గ్రైండ్ చేసి గోరువెచ్చని నీటిలో వేసి ఉదయాన్నే ఆ నీటిని తాగండి.
Also Read : Watch Now: కాటేసే నాగరాజుకే కిస్ ఇచ్చిన బలరాజు..నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో..
Also Read : Rhino In Football Ground: ఫుట్‌బాల్ గ్రౌండ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఖడ్గమృగం.. ఆటగాళ్లు ఏం చేశారో చూడండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook