Uric Acid: యువతలో కీళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఇవే, ఈ అలవాట్లు తప్పకుండా మానుకోండి..
How To Cure Uric Acid Permanently: శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాలు అతిగా పెరగడం కారణంగా కీళ్ల నొప్పులు వస్తున్నాయి అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా దినచర్యలో భాగంగా కొన్ని అలవాట్లను మానుకోవాల్సి ఉంటుంది. వీటిని మానుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందడమే కాకుండా అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.
How To Cure Uric Acid Permanently: ప్రస్తుతం చిన్న పెద్ద తేడా లేకుండా కీళ్ల నొప్పులు అందరినీ వెంటాడుతున్నాయి. సాధారణంగా ఈ నొప్పులు చలికాలం ఎక్కువగా వస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఆధునిక జీవనశైలి కారణంగా ప్రతి సీజన్లో కీళ్ల నొప్పులు వస్తున్నాయి. ఈ నొప్పుల బారిన పడేవారు నడవడానికి చాలా ఇబ్బందులు పడతారు. కొన్ని కొన్ని సందర్భాల్లో కూర్చొని లేచే క్రమంలో కూడా తీవ్ర నొప్పులు వస్తూ ఉంటాయి.
అయితే ఇలా నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలోని యూరిక్ యాసిడ్ పరిమాణాలు పెరగడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో అతిగా పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ కారణంగా కీళ్లలోకి చేరుకొని స్పటికంలా తయారవుతుంది. దీనికి కారణంగా కీళ్ల నొప్పులతో పాటు కొందరిలో మోకాళ్ళ నొప్పులు కూడా వస్తున్నాయి. అయితే ఈ కీళ్ల నొప్పులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలేంటో ఇప్పటికే కీళ్ల నొప్పులు ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు:
రాత్రి అతిగా తినడం:
ప్రస్తుతం చాలామంది రాత్రి అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకొని నిద్రపోతున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడమే కాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ కూడా పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు రాత్రిపూట కేవలం పండ్ల ను మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉన్నాయి.
ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్
ఆధునిక జీవనశైలి:
ఆధునిక జీవన శైలిని దృష్టిలో పెట్టుకొని చాలామంది అనారోగ్యకరమైన అలవాట్లపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీని కారణంగా సులభంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ఆధునిక జీవనశైలి అనుసరించే వారు ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలను తినడం, మద్యపానం సేవించడం వంటి అలవాట్ల కారణంగా కీళ్లనొప్పుల బారిన పడుతున్నారు.
నీటిని తక్కువగా తాగడం:
కొంతమంది పనిలో భాగంగా నీటిని తాగడం మర్చిపోతారు దీని కారణంగా శరీరం డిహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయే అవకాశాలున్నాయి. కాబట్టి కీళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలని ప్రతి రోజు నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది.
నిద్ర లేకపోవడం:
ఇటీవల వెళ్లడైన పరిశోధనల ప్రకారం.. శరీరానికి తగిన మోతాదులో నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయి. కొంతమంది గుండెపోటు సమస్యల బారిన పడి మరణిస్తున్నారు. అంతేకాకుండా శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణాలకు కూడా పేరుకుపోతున్నాయి. తద్వారా కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు తగిన మోతాదులో నిద్రపోవడం శరీరానికి చాలా మంచిది.
ఇది కూడా చదవండి : Flipkart Big Bachat Dhamaal Sale: రూ. 7 వేలకే టీవీ, 16 వేలకే ల్యాప్‌టాప్స్, 58 వేల నుండే బైక్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి