Vegetarian Foods To Increase Hemoglobin: మీరు ఎప్పుడైనా ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్ వద్దకు వెళ్తే.. డాక్టర్ పలు వైద్య పరీక్షలు నిర్వహించడం, అందులో ఎక్కువ ఛాన్సెస్ మీకు హిమోగ్లోబిన్ లోపం ఉందని చెప్పడం చూసే ఉంటారు. దానికి కారణం హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల శరీరంలో చోటుచేసుకునే మార్పులే ఆరోగ్య సమస్యల రూపంలో బయటపడుతుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంతకీ హిమోగ్లోబిన్ లోపం ఎందువల్ల ఏర్పడుతుంది అంటే.. ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ లోపిస్తుంది. ఐరన్ ఉన్న ఫుడ్స్ తినకపోతే ముందుగా శరీరంలో ఐరన్ లోపిస్తుంది. ఆ తరువాత అది కాస్తా హిమోగ్లోబిన్ లోపానికి దారితీస్తుంది. అందుకే ఐరన్ ఫుడ్స్ ఎక్కువగా తినాలి. అలాగే విటమిన్ B12, ప్రోటీన్స్ వంటి పోషక విలువలు ఉన్న ఆహారం తీసుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.


త్వరగా అలిసిపోతుంటారు
శరీరంలో ఎర్ర రక్త కణాలు కానీ లేదా హిమోగ్లోబిన్ కానీ తక్కువగా ఉన్నప్పుడు శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సీజన్ అందడం ఇబ్బందిగా మారుతుంది. ఈ కారణంగానే హిమోగ్లోబిన్ లోపంతో బాధపడే వారు త్వరగా అలిసిపోతుంటారు. అంతేకాకుండా హిమోగ్లోబిన్ లోపంతో బాధపడే వారిలో తలనొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కళ్లు తిరగడం, చర్మం పేలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.


స్త్రీ, పురుషుల్లో హిమోగ్లోబిన్ నార్మల్ లెవెల్స్ ఎంత ఉంటాయి ?
పురుషుల్లో నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్స్ 14.0 గ్రామ్స్ పర్ డెసిలిటర్ నుండి 17.5 gm/dl ఉంటాయి. స్త్రీల విషయానికొస్తే.. నార్మల్ హిమోగ్లోబిన్ లెవెల్స్ 12.3 gm/dl నుండి 15.3 gm/dl ఉంటాయి. 


మెడిసిన్స్ పై ఆధారపడకుండా హిమోగ్లోబిన్‌ని సహజంగా పెంచుకోవాలంటే.. పాలకూర లాంటి ఆకు కూరలు బాగా తినాలి. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 


పచ్చి బఠానీలు, పుప్పు ధాన్యాలు, బీన్స్ వంటి గింజల్లోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. మీ ఆహారంలో వీటిని ఒక భాగంగా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది. డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎండు ద్రాక్షల్లోనూ ఐరన్ పుష్కలంగా ఉంటుంది. 


ఇది కూడా చదవండి : Cholesterol Reducing: ఈ బ్లూ టీతో ఎంతటి కొలెస్ట్రాల్ అయినా 15 రోజుల్లో కరిగిపోవాల్సిందే!


ఎలాంటి పండ్లు తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయంటే ..
యాపిల్స్, ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, దానిమ్మ పండ్లు, పుచ్చకాయలు వంటి పండ్లు తింటే హిమోగ్లోబిన్ లెవెల్స్ సహజంగా పెరుగుతాయి. 


ఐరన్‌కి, హిమోగ్లోబిన్‌కి ఎలాగైతే లింక్ ఉందో.. అలాగే ఐరన్‌కి, విటమిన్ సి కూడా అంతే లింక్ ఉంది. ఐరన్ లోపంతో హిమోగ్లోబిన్ లోపం ఏర్పడినట్టుగానే.. ఒంట్లో విటమిన్ సి తగినంత మోతాదులో లేకపోతే.. మీరు తినే ఆహారంలో ఉన్న ఐరన్‌ని మీ శరీరం స్వీకరించలేదు. అందుకే ఐరన్ ఫుడ్స్ తీసుకునే క్రమంలో విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆరెంజెస్, నిమ్మరసం, స్ట్రాబెర్రీ పండ్లు, టమాటాలు వంటివి ఆహారంలో ఒక భాగం చేసుకోవడం మర్చిపోవద్దు.


(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించానికి ముందు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)


ఇది కూడా చదవండి : Monsoon Health Tips: వర్షాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యలేంటి, ఎలా విముక్తి పొందాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి