Monsoon Health Tips: వర్షాకాలం ప్రారంభమైపోయింది. దేశమంతా విస్తారంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో కలుషిత నీటి కారణంగా వివిధ రకాల చర్మ వ్యాధులు, అనారోగ్యం వెంటాడవచ్చు.
Monsoon Health Tips: సాధారణంగా వర్షాకాలంలో అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా చర్మ సంబంధిత ఎలర్టీ ఎక్కువగా బాధిస్తుంటుంది. చర్మ సంబంధిత సమస్యలు వర్షాకాలంలో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యల్ని సులభంగా హోమ్ రెమిడీస్ సహాయంతో ఎలా ఉపశమనం పొందాలో తెలుసుకుందాం..
చర్మపై ఎర్రటి దద్దుర్లు స్కిన్ ఎలర్జీ వస్తే చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. వీటికి చెమట తోడైతే బ్యాక్టీరియా పుడుతుంది. ఫలితంగా దురదతో పరిస్థితి వికటిస్తుంది.
రింగ్ వర్మ్ ఎలర్జీ వర్షాకాలంలో సాధారణంగా రింగ్ వర్మ్ ఎలర్జీ కేసులు ఎక్కువగా ఉంటాయి. ఇది ఓ రకమైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. కాలుష్యం కారణంగా సంభవిస్తుంది. శరీరం నిండా ఎర్రటి మచ్చలు వచ్చి దురద ఎక్కువగా ఉంటుంది. చేతులు, కాళ్ల వేళ్ల మధ్య గింజల్లాంటివి ఏర్పడి దురద వస్తుంటుంది.
దురద ఎక్కువగా ఉండటం వర్షాకాలంలో సహజంగా కలుషిత నీరు, దుమ్ము ధూళి కారణంగా దురద ఎక్కువగా పీడిస్తుంటుంది. శరీర ఉష్ణోగ్రత కూడా మారవచ్చు. చర్మం నిర్జీవంగా మారిపోతుంది.
రోగ నిరోధక శక్తి వర్షాకాలంలో ఎదురయ్యే అన్ని రకాల ఎలర్జీలకు, స్కిన్ ఎలర్జీలకు సమాధానం శరీరంలో ఇమ్యూనిటీని పెంచడమే. బలవర్ధకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచుకుని ఎలర్జీ సమస్యల్నించి కాపాడుకోవచ్చు.
శుచి శుభ్రత వర్షాకాలంలో ఎలర్జీ సమస్యల్నించి విముక్తి పొందాలంటే ఇంటి పరిసరాలు, ఇళ్లు పరిశుభ్రంగా ఉండాలి. నిల్వ నీరు వాడకూడదు. ఇంట్లోకి స్వేచ్ఛగా గాలి వెలుతురు ప్రసరించేట్టు చూసుకోవాలి.