Weight Loss: పుచ్చకాయ రసంతో కూడా వారంలో బరువు తగ్గొచ్చు!
Watermelon Juice For Weight Loss: పుచ్చకాయ రసాన్ని ప్రతి రోజు తాగడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ రసాన్ని తాగడం వల్ల సులభంగా ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
Watermelon Juice For Weight Loss: ప్రస్తుతం వేసవి కాలంలో చాలా మంది హైడ్రేషన్ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పుచ్చకాయ రసాన్ని తాగాల్సి
ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు కడుపునొప్పి, డీహైడ్రేషన్, స్థూలకాయం, బలహీనమైన రోగనిరోధక శక్తి, జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఎండాకాలంలో చర్మ, శరీర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పుచ్చకాయ రసాన్నితీసుకోవాల్సి ఉంటుంది. ఈ రసాన్ని ఎలా తాగాలో, తాగడం ఈ రసం ప్రతి రోజు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పుచ్చకాయ రసాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
తరిగిన పుచ్చకాయ ముక్కలు
ఒక టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి
రెండు టీ స్పూన్ల నిమ్మరసం
ఒక నారింజ పండు
పుదీనా ఆకులు
ఒక టీ స్పూన్ ఆలివ్ నూనె
పుచ్చకాయ రసాన్ని ఇలా తయారు చేయండి:
పుచ్చకాయ రసాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో తరిగిన పుచ్చకాయ వేసుకోవాలి. వేయించిన జీలకర్ర పొడి పై పదార్థాలన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పుచ్చకాయ మిశ్రమాన్ని ఓవెన్‌లో 180-200 డిగ్రీల సెల్సియస్‌లో 10 నిమిషాలు బేక్ చేసిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకుని తాగితే.. శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
బరువు తగ్గిస్తుంది:
పుచ్చకాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో వేడి తగ్గి చర్మ సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఇందులో పీచుపదార్థాలు కూడా అధికంగా లభిస్తాయి. కాబట్టి సులభంగా శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియత్రిస్తుంది. శరీర బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ పుచ్చకాయ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి