Kajjikayalu Recipe: కజ్జికాయలను చేయడం ఎంతో ఈజీ.. మీరు కూడా ట్రై చేయండి!
Kajjikayalu Recipe: మన సంప్రదాయ వంటకాలు ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. ముఖ్యంగా మనం పండగలకు చేసుకొనే వంటలు ఎంతో ప్రత్యేకమైనవి అని చెప్పవచ్చు. అయితే అందరికి ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
Kajjikayalu Recipe: మనం చేసుకునే పిండి వంటకాల్లో కజ్జికాయలు ఒకటి. కజ్జికాయలు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు. పండగలకు వీటిని ఎక్కువగా తయారు చూస్తూ ఉంటారు. వీటిని తయారు చేసుకోవడం చాలా సులభం. మొదటిసారి చేసే వారు కూడా కజ్జికాయలను సులభంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల క్రిస్పీగా, రుచిగా కజ్జికాయలు తయారు అవుతాయి. వీటిని పండగులకు మాత్రమే కాకుండా చిరుతిండి తినాలి అనుకొన్నప్పుడు కూడా చేసుకోవచ్చు.
కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు మైదాపిండి, ఒక టేబుల్ స్పూన్ రవ్వ, ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ నెయ్యి,
ఒక కప్పు పుట్నాలు, ఒకటి ఎండు కొబ్బరి , ఆరు యాలకులు, నూనె
కజ్జికాయలు తయారు చేసుకోవడం ఎలా:
ముందుగా ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. దీని చపాతీ పిండిలా తయారు చేసుకోవాలి. తరువాత నూనె రాసి మూత పెట్టి పక్కకు ఉంచాలి. జార్ లో కొబ్బరి ముక్కలు, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులోకి పుట్నాల పప్పు వేసి మిక్సీ పట్టుకుని అదే గిన్నెలోకి తీసుకోవాలి.
జార్ లో బెల్లం వేసి మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత పిండిని తీసుకుని చిన్న ఉండలుగా తయారు చేసుకోవాలి. ఈ పూరీని కజ్జికాయల ఆకారంలోకి చేసుకోవాలి. వీటిని అంచులను వత్తి ఫోర్క్ తో డిజైన్ వత్తుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక కజ్జికాయలను వేసి రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే కజ్జికాయలు తయారవుతాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని తినండి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter