Rasam: హోటల్ స్టైల్ రసం తయారు చేసుకోవడం ఎలా?
Rasam Recipe: మన ఇంట్లో రుచికరమైన హోటల్ స్టైల్ రసం చేసుకోవడం చాలా సులభం. ఇది సాధారణంగా అన్నం ,కూరగాయల సైడ్ డిష్‌తో తింటారు. అయితే దీనిని సూప్‌గా కూడా తాగవచ్చు. ఈ సౌత్ ఇండియన్ రసం రెసిపీకి రసం పొడి, ఇతర పదార్థాలు ఉంటే సరిపోతుంది.
Rasam recipe: సాధారణంగా చలికాలంలో చాలా మంది సీజన్ల్ వ్యాధుల బారిన పడుతుంటారు. ఈ సమస్యలు ఎక్కువగా రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వస్తుంటాయి. అయితే చాలా మంది రోగనిరోధక పెంచుకోవడం కోసం వివిధ మందులు , చిట్కాలు పాటిస్తారు. కానీ ఎలాంటి లాభం కలగదు. అయితే ఈ ఇంటి చిట్కాను పాటించడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఇది రోగనీరోధక శక్తి పెంచడంతో పాటు, ఇతర సమస్యల నుంచి బయటపడచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే ఇది తరుచు మనం ఇంట్లో తయారు చేసుకొనే రసం. రసం తీసుకోవడం వల్ల శరీరానికి హాని చేసే వ్యధుల నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థను మెరుగు చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది.
రసం తయారీకి కావాల్సిన పదార్థాలు:
చింతపండు గుజ్జు , టమాటా , కరివేపాకులు,
మిరియాలు, వెల్లుల్లి , పసుపు , ఎండు మిరపకాయలు,
ఉప్పు, జీలకర్ర , ఇంగువ , కొత్తిమీర , నూనె , ఆవాలు
రసం తయారీ విధానం:
ముందుగా మిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకుని మిక్సీలో వేసి పొడిగా తయారు చేసుకోవాలి. ఆ తరువాత కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. అందులో టొమాటో , కరివేపాకులు, పసుపు, కొద్దిగా ఉప్పు వేసి నాలుగు నిమిషాల పాటు ఉడికించాలి. ముందు చేసిన పొడిని వేసి కలుపుకోవాలి. తరువాత చింత పండు గుజ్జు, నీటిని పోయాలి. పది నిమిషాల పాటు ఉడికించాలి.
మరో గిన్నెలో నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో ఆవాలు, ఎండు మిరపకాయ, ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇంకో పాత్రలో ఉండే మిశ్రమాన్ని ఇందులో వేయాలి. స్టవ్ ఆర్పి కొత్తిమీర ఆకులతో గార్నిష్ చేసుకోవాలి. రసం తయారవుతుంది.
దీన్ని అన్నంతో రోజూ మధ్యాహ్నం భోజనంలో తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ రసం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సాధారణ చలికాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గుతాయి.
Also Read Healthy Winter Drinks: ఈ డ్రింక్స్ ప్రతి రోజు తాగితే..శరీరానికి బోలెడు లాభాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter