Tomato Curry  Recipe: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌ లో సరిగా వంట చేసుకొని తినడానికి టైమ్‌ దొరకటం లేదు అనే బ్యాచ్‌లర్స్‌కు ఇది ఒక అద్భుతమైన డిష్‌ అని చెప్పవచ్చు. దీని కోసం మీరు మీ టైమ్‌ని వేస్ట్‌ చేసుకోవాల్సిన అవరం లేదు. ఎంతో సులువుగా, సింపుల్‌గా ఈ వంటను తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు మార్కెట్‌ చుట్టు తిరగాల్సిన అవసం లేదు. ఇంతకు ఈ డిష్‌ ఎంటి అంటే మనం అందరికి నచ్చే డిష్‌ టమాటో కర్రీ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టమాటో కర్రీ ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని మనం వేడి వేడి అన్నం లేదా చపాతీలో కలిపి తీసుకోవచ్చు. దీని పిల్లలు, పెద్దలు తినవచ్చు. దీని తయారు చేసుకోవడం ఎంతో సులభం అని చెప్పవచ్చు. మీరు కేవలం పది నిమిషాల్లో దీని చేసుకోవచ్చు. బిజీగా ఉన్నప్పుడు ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా దీని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే ఇందులో ఎన్నో రకాల పోషకాలు దాగి ఉంటాయి. ఈ టమాటోతో మనం కేవలం కర్రీ మాత్రమే కాకుండా ఎన్నో వంటలు తయారు చేసుకోవచ్చు. దీంతో పచ్చడి కూడా చేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఈ టమాటో కర్రీని తయారు చేసుకొని తిన్నవచ్చు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం ఇక్కడ సింపుల్‌ పద్ధతిలో తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు:


* 2  టమాటాలు 


* 1  నల్ల మిరియాలు 


* 1/2  టీస్పూన్  జీలకర్ర


* 2  పచ్చిమిర్చి 


* 1  టేబుల్ స్పూన్  నూనె


* 1/2  టీస్పూన్  పసుపు పొడి 


* 1/2  టీస్పూన్  కారం పొడి


* 1  కరివేపాకు


* రుచికి తగినంత  కొత్తమీర


* రుచికి తగినంత  ఉప్పు


తయారు చేసే విధానం:


1. టమాటాలను  మెత్తగా   నూరుకోండి లేదా  చిన్న ముక్కలుగా  కట్ చేసుకోండి. 


2. పాన్  మీద నూనె  వేడి  చేసి,  జీలకర్ర వేసి  వేయించండి. 


3.  కరివేపాకు, పోపు దినుసులు  వేసి వేయించండి.


4.  పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించండి.


5. ఇప్పుడు కారం పొడి, పసుపు పొడి కలుపుకోవాలి.


6. టమాటా పేస్ట్ లేదా ముక్కలు వేసి నూనె  తేలియా వచ్చే వరకు కలపుకొని పక్కకు తీసుకోవాలి. 


7.  ఈ విధంగా టమాటో కర్రీ తయారు అవుతుంది. దీని వేడి వేడి అన్నం లేదా చపాతీలో తీసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. 


Also read: Abortion Pills: ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే మహిళలు జాగ్రత్త..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook