Ragi Dosa: ఎంతో సింపుల్ గా రాగిదోసె రెడీ చేసుకోవడం ఎలా?
Ragi Dosa Recipe: రాగి దోస రెసిపీ చేసుకొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. మీరు కూడా తప్పకుండా ఈ రాగి దోశను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. ఈ రాగి దోసె కొబ్బరి చట్నీని సైడ్ డిష్ గా చేసుకుంటే మరింత అద్భుతంగా ఉంటుంది.
Ragi Dosa Recipe: ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఎంతో దృఢంగా ఉంటుంది. అయితే ప్రతిరోజు తినే ఇడ్లీ, దోశ కాకుండా రాగితో దోశ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. దీని ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యంతో పాటు ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. దీని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. వీటిలో ఉండే విటమిన్, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
రాగి దోశ కోసం కావాల్సిన పదార్థాలు:
ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు సూజి రవ్వ, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పెద్ద ఉల్లిపాయ, జీలకర్ర, మిరియాల పొడి, నీరు , నూనె
రాగి దోశ తయారు చేయడం ఎలా:
ముందుగా ఒక గిన్నెలో రాగి పిండి, సూజి రవ్వ, బియ్యంపిండి తీసుకోవాలి. తరువాత పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లి, జీలకర్ర, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అందులో రెండు కప్పుల నీళ్లు పోసి కలపాలి. తర్వాత పదిహేను నిమిషాలు పాటు నానబెట్టాలి. ఇందులోకి 1 1/2 కప్పుల నీళ్లు పోసి పిండిని నీళ్లతో కలపాలి. తర్వాత దోసె పాన్ ను స్టౌ మీద ఉంచి వేడి అయ్యాక ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని దోసెగా పోసుకోవాలి. నూనె వేసి బంగారు రంగు వచ్చేవరకు రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రాగి దోసె రెడీ. దీనికి కొబ్బరి పచ్చడి బెస్ట్ కాంబినేషన్. దీని పిల్లలకు పెట్టడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది. దీని ప్రతిరోజు పిల్లలు తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగే కడుపు నిండిన భావన కలుగుతుంది. పెద్దలు కూడా రాగి దోశ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు. ఈ విధంగా మీరు కూడా రాగి పిండి దోశ తీసుకోవడం వల్ల ఆరోగ్య లాభాలు పొందవచ్చు.
Also Read Poha: అటుకులతో ఉప్మా...పదే నిమిషాల్లోనే రెడీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter