Blood Circulation: రక్త శుభ్రత, రక్త ప్రసరణ మెరుగుదల ఎలా ?
మనిషి శరీరం (Human Body ) లో ప్రధానమైందిగా చెప్పుకునేది రక్త ప్రసరణ. ఈ వ్యవస్థ సక్రమంగా ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టే. మరి రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి శరీరం (Human Body ) లో ప్రధానమైందిగా చెప్పుకునేది రక్త ప్రసరణ. ఈ వ్యవస్థ సక్రమంగా ఉంటే ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్టే. మరి రక్త ప్రసరణ సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లడ్ సర్క్యులేషన్ ( Blood Circulation )..బ్లడ్ ప్యూరిఫికేషన్ ( Blood purification ). మనిషి శరీరంలో రక్త ప్రసరణ, శుభ్రత అనేది చాలా ముఖ్యం. ఈ రెండూ సక్రమంగా ఉంటే చాలా వరకూ ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఈ రెండూ సక్రమంగా లేకపోవడం వల్లనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే రక్తాన్ని ఎప్పుడూ శుభ్రపర్చుకోవాలి. ప్రసరణ సరిగ్గా ఉండేలా చూసుకోోవల్సి ఉంటుంది. Also read: Healh Tips: బెల్లం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా ?
రక్త శుభ్రత..రక్త ప్రసరణ మెరుగుదల ఎలా
మనిషి శరీరంలోని ఊపిరితిత్తులల్లో ( Lungs ) రక్తం శుభ్రపర్చడమనే ప్రక్రియ జరుగుతుంటుంది. రక్తంలో ( Blood ) ఉన్న మలినాల్ని మూత్రపిండాలు ( Kidneys )వడపోతే చేసే పని చేస్తాయి. గాలిలో ఉన్న ఆక్సిజన్ ను గ్రహించి...ఆ రక్తం ద్వారా శరీర భాగాలకు సరఫరా చేస్తుంటుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్య తలెత్తితే ఈ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. నిత్యం మన అలవాట్ల ద్వారా రక్తాన్ని శుభ్రపర్చుకోవడం గానీ..రక్త ప్రసరణ మెరుగ్గా ఉండేలా గానీ జాగ్రత్తలు తీసుకోవచ్చు. Also read: Fenugreek Seeds: మెంతులతో ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. అల్లం ( Ginger ) రసంలో లేదా దంచిన అల్లంలో కాస్త తేనెచుక్కలు ( Honey ) కలుపుకుని సేవిస్తే రక్తంలోని మలినం విసర్జితమవుతుంది. ఉల్లి ( Onion ), వెల్లుల్లి ( Garlic ) మీ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోండి. వెల్లుల్లి మీ శరీరంలో కొత్త కణాల తయారీకు సహకరిస్తుంది.
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే రక్తంలోని మలినాలు బయటకుపోతాయి. రోజూ కనీసం ఓ గంటసేపు వాకింగ్ చేస్తే...క్యాలరీలు తగ్గి బాడీలో ఉన్న విషపదార్ధాలు బయటకు పోతాయి. ఫలితంగా రక్తప్రసరణ ( Blood Circulation )మెరుగు పడుతుంది.
వారంలో 2-3 సార్లు బీట్ రూట్ గానీ జ్యూస్ ( Beet root juice ) గానీ తీసుకుంటే..రక్తం ఉత్పత్తి అవుతుంది. నీటిలో కాస్త సోపు ( Saunf ) కలిపి తాగితే కొవ్వు పరిమాణం తగ్గి..అధిక బరువును నియంత్రిస్తుంది. ఇక మునగాకు, కందిపప్పు, కోడిగుడ్డు, కొద్దిగా నెయ్యి కూడా రక్తాన్ని శుభ్రపర్చడానికి తోడ్పడుతాయి. రాత్రి నిద్రపోవడానికి 2-3 గంటల ముందే ( Dinner before 2-3 hours of sleep ) డిన్నర్ పూర్తి చేయడం మంచిది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. Also read: Depression: ఆ ఐదు పదార్ధాలు తింటే...ఆందోళన తగ్గిపోతుంది.