Belly Fat Weight Loss At Home In 1 Week: లావుగా ఉన్నవారు స్లిమ్ అవ్వడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ వారు బెల్లీ ఫ్యాట్ బరువు తగ్గలేకపోతున్నారు. కొంతమంది అయితే బరువు పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు కాబట్టి లావు అవుతున్నవారు ఎంత త్వరగా శరీర బరువును తగ్గించుకుంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శరీరంలో బరువు పెరగడానికి ప్రధాన కారణాలు రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడమేనని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల సులభంగా బరువు తగ్గించుకోవచ్చని అన్ని పనులు సూచిస్తున్నారు. బరువు తగ్గే క్రమంలో తప్పకుండా జీవన శైలిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే బరువు తగ్గిన వెంటనే మళ్లీ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఈ కింది చిట్కాలను పాటించడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.


బరువు తగ్గాలంటే ఈ అలవాట్లను పాటించండి:
ఉదయాన్నే తప్పకుండా ఈ నీటిని తాగండి:

శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి వేడి నీరు కీలక పాత్ర పోషిస్తారు ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు గోరువెచ్చని నీటిని తాగడం వలన మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా పొట్టలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు కూడా సులభంగా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో గోరువెచ్చని నీటిని తాగడం ప్రధానమని వారు సూచిస్తున్నారు.


Also Read: Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి   


ఆరోగ్యకరమైన ఆహారాలను మాత్రమే తినాలి:
ఎంత ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే శరీరం అంత ఆరోగ్యంగా ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే బరువు తగ్గే పాత్రలో ఉదయం తీసుకునే అల్పాహారం కూడా కీలకమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం అల్పాహారంలో ప్రోటీన్, ఫైబర్ ఆధారిత ఆహారాలు తీసుకోవడం వల్లే బరువు తగ్గుతారని వారు అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో గుడ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, మొలకలు, పండ్ల, రసాలు కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది.


వ్యాయామాలు చేయడం తప్పనిసరి:
బరువు తగ్గాలన్న.. పెరగాలన్న వ్యాయామాలు తప్పనిసరి. అయితే బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్న వారు వ్యాయామం ప్రతిరోజు చేయడం వల్ల సులభంగా నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా బరువు కూడా తగ్గొచ్చు. కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాకింగ్ తో పాటు యోగ చేయాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల మీరే మంచి ఫలితాలు పొందుతారు. 


శరీరంలో నీటి కోరత సమస్యలు ఉండకూడదు:
బరువు తగ్గే క్రమంలో శరీరం ఎప్పుడు హైబ్రిడ్గానే ఉండాలి. శరీరంలో నీటి కోరత ఏర్పడితే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇది జీర్ణక్రియ పై ప్రభావం చూపి శరీర బరువులో మార్పులు చేర్పులు కూడా రావచ్చు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో శరీరం నీటి కొరత లేకుండా ఉండాలి.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook