Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి

Bangles Market In Hyderabad: హైదరాబాద్‌లో వివిధ రకాల గాజుల దుకాణాలకు అడ్డా. చార్మినార్‌కు దగ్గరలో మీకు ఎలాంటి రకాల గాజులు కావాలన్నా దొరుకుతాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Apr 27, 2023, 06:40 PM IST
Hyderabad Bangles Market: గాజుల షాపింగ్‌కు ఇక్కడికి వెళ్లండి.. అదిరిపోయే డిజైన్లు ఉన్నాయి

Bangles Market In Hyderabad: హైదరాబాద్ అంటే చాలా మందికి గుర్తుచ్చొది ముందు బిర్యానీ. కానీ హైదరాబాద్‌లో బిర్యానీ కంటే ఇంకా ఫేమస్ అయినవి చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. లేడిస్ షాపింగ్‌కు చార్మినార్ అడ్డాగా చెప్పొచ్చు. ఇక మనకు ఏ వస్తువులు కావాలన్న మంచి క్వాలిటీలో తక్కువ ధరకే లభిస్తాయి. ముఖ్యంగా దుస్తులు చాలా చౌకగా దొరుకుతాయి. అంతేకాదు చార్మినార్ సమీపంలోని లాడ్ బజార్ గాజులకు ఎంతో ప్రసిద్ధి. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి కొనుగోలుదారులను ఆకర్షించే బ్యాంగిల్స్ మార్కెట్ ఇది. ఈ గాజుల వ్యాపారం ఎంతో మందికి జీవనోపాధితో పాటు ఆదాయం అందిస్తోంది. 

లాడ్ బజార్‌కు సమీపంలోని పాత టాప్ ఖానా రోడ్, బేగంబజార్‌లో రంగురంగుల బ్యాంగిల్ షాపుల వరుసలు మనకు దర్శనమిస్తాయి. బేగంబజార్‌లోని టాప్ ఖానా రోడ్‌లోని బ్యాంగిల్ దుకాణాలు ప్రత్యేకంగా గాజు, ప్లాస్టిక్‌లతో తయారు చేసిన బ్యాంగిల్స్‌ను అమ్ముతున్నాయి. బేగంబజార్‌లోని చాలా గాజుల దుకాణాలు హోల్‌సేల్ మార్కెట్‌లను నిర్వహిస్తున్నాయి. ఇతర జిల్లాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి తక్కువ ధరకు కొనుగోలు చేసి.. తమ ఊళ్లలో అమ్ముకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మహారాష్ట్రలోని సమీప జిల్లాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ షాపు యజమానులు  ఇక్కడికి తప్పనిసరిగా వస్తారు.

మెటల్, గ్లాస్, ప్లాస్టిక్‌తో తయారు చేసిన వివిధ రకాల గాజులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం గాజు గాజు పరిశ్రమకు కేంద్రంగా ఉన్న ఫిరోజాబాద్ నుంచి దిగుమతి అవుతాయి. ఫిరోజాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, జైపూర్ ప్రాంతాల నుంచి కూడా గాజులు దిగుమతి అవుతున్నాయి. ఇక్కడికి వచ్చే చాలా మంది గాజు బ్యాంగిల్స్ కొనేందుకు ఇష్టపడతారు. డజన్‌కు రూ.50 నుంచి మొదలై రూ.150 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. నాణ్యత, డిజైన్‌ను బట్టి రేటు ఉంటుంది. మార్కెట్ పీక్ సీజన్‌లో ప్రతిరోజూ దాదాపు కోటి రూపాయల బిజినెస్ జరుగుతుందని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.

Also Read: Liquid DAP: రైతులకు గుడ్‌న్యూస్.. లిక్విడ్ డీఏపీ వచ్చేసింది.. ధర ఎంతంటే..?  

చార్మినార్, బేగంబజార్ నుంచే కాకుండా హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చి గాజులు కొనుగోలు చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్‌, రంజాన్, దసరా, దీపావళి వంటి పండుగల వేళ గాజుల విక్రయాలు భారీగా ఉంటాయి. హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కుటుంబాలు హోల్‌సేల్ ధరలకు గాజులను కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. కొందరు ఇంటి యజమానులు 1969లో మొదట ఇక్కడ దుకాణాలను స్థాపించారని బ్యాంగిల్ స్టోర్ యజమాని విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం మార్కెట్‌లో 100కి పైగా దుకాణాలు బ్యాంగిల్స్ ఉన్నాయన్నారు. గాజుల దుకణాలను సందర్శించే వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో చుడీ బజార్ షాపింగ్ హబ్‌గా మారిందన్నారు.  గత 40 ఏళ్లలో విపరీతంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.

Also Read: IPL 2023 Points Table: తలైవా మ్యాజిక్.. టాప్‌లో చెన్నై సూపర్ కింగ్స్.. ఎస్ఆర్‌హెచ్ పరిస్థితి ఇలా..!   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News