Reduce Cholesterol: చెడు కొలెస్ట్రాల్ వెన్నలా 8 రోజుల్లో కరగడానికి అద్భుతమైన చిట్కాలు.!
How To Reduce Cholesterol In 8 Days: బాడీలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడానికి తప్పకుండా బీట్‌రూట్ ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
How To Reduce Cholesterol In 8 Days: శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరగడం వల్ల ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అయితే తీవ్ర కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో కరిగే ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిండానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే పలు రకాల ఆహారాలు కూడా ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలు ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణంలో ఉంటుందో తెలుసుకుందాం..
బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు, కరిగే ఫైబర్‌లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది శరీరంలోని సిరలను నియంత్రించడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతి రోజూ ఆహారంలో బీట్‌రూట్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తపోటు స్థాయిలను కూడా సులభంగా తగ్గింస్తుంది.
బచ్చలికూర:
బచ్చలికూరలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి దీనిని ఆహారంలో ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. దీంతో సులభంగా చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బచ్చలికూరను ప్రతి రోజూ తినడం వల్ల శరీర బరువును కూడా నియంత్రిస్తుంది.
బ్రోకలీ:
బ్రోకలీ కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను సులభంగా నియత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, డైటరీ ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. కరిగే ఫైబర్ అధికంగా ఉండడం వల్ల కొలెస్ట్రాల్‌ను సులభంగా నియంత్రిస్తుంది.
క్యారెట్:
క్యారెట్ చాలా మందికి ఇష్టమైన కూరగాయ. దీనిని చాలా రకాల వంటకాల్లో వినియోగిస్తారు. అయితే క్యారెట్ ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి బీటా కెరోటిన్ లభించి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా రక్తన్ని శుద్ధి చేయడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
వెల్లుల్లి:
వెల్లుల్లిల్లో ఆయుర్వేద ఔషధ గుణాలు లభిస్తాయి. అంతేకాకుండా వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని ఆహారాల్లో తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఆహారంలో వీటిని తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Gannavaram: గన్నవరంలో ఉద్రిక్తం.. టీడీపీ ఆఫీసుపై ఎమ్మెల్యే వంశీ వర్గీయులు దాడి
Also Read: Income Tax Return 2023: పన్ను చెల్లింపుదారులకు ముఖ్య గమనిక.. ఐటీఆర్ ఫారమ్‌లో కీలక మార్పులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి