Lemon Juice Can Reduce High Blood Pressure in 9 Days: ఆధునిక జీవనశైలి కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలామందిలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరగడం కారణంగా బరువు పెరిగి బిపి, షుగర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రపంచంలో అన్ని దేశాలతో పోలిస్తే భారత్లో అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య రోజుకు పెరుగుతోంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా జీవనశైలిలో మార్పు చేర్పులు చేసుకోవడమే కాకుండా.. ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక రక్తపోటుతో బాధపడే వారి ప్రతిరోజు ఆహారాన్ని డైట్ పద్ధతిలో తీసుకోవడం వల్ల ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి బారిన పడిన చాలామందిలో రక్తంలో చక్కెర పరిమాణాలు పెరిగి మధుమేహం వ్యాధి బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే తప్పకుండా పలు ఆరోగ్యకరమైన చిట్కాలను పాటించాల్సి ఉంటుంది.


Also Read: Cyclone Biparjoy: దూసుకువస్తున్న బిపోర్‌ జాయ్‌ తుఫాన్.. ఎఫెక్ట్ ఎక్కడంటే..?


ఈ రసాలతో కూడా అధిక రక్తపోటుకు చెక్ పెట్టొచ్చు:


నిమ్మరసం:
అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు నిమ్మరసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగించేందుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడకుండా శరీరాన్ని సంరక్షిస్తాయి.


నిమ్మరసంలో దాల్చిన చెక్క పొడి కలిపి కూడా తీసుకోవచ్చు:
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అయితే నిమ్మరసంలో దాల్చిన చెక్క పొడిని కలుపుకొని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఔషధ గుణాలు శరీరంలోని అన్ని రకాల వ్యాధులపై ప్రభావంతంగా సహాయపడతాయి. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు ఈ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.


Also Read: 4X4 SUV Cars : 4X4 SUV సెగ్మెంట్‌లో తక్కువ ధరలో లభించే కారు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి