Hypothyroid Symptoms: ఇటీవలికాలంలో థైరాయిడ్, బ్లడ్ షుగర్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు అధికమౌతున్నాయి. అసలు హైపో థైరాయిడ్ లక్షణాలేంటి, ఎలా నియంత్రించవచ్చో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సరైన ఆహారం ఉంటే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తినకపోవడం వల్లనే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఆహారపు అలవాట్లలో మార్పులు, చెడు జీవనశైలి కారణంగా అనారోగ్యం వెంటాడుతుంటుంది. ముఖ్యంగా హైపో థైరాయిడ్ ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలో హైపో థైరాయిడ్ లక్షణాలేంటి, నియంత్రించేందుకు ఏలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం..


హైపో థైరాయిడ్ లక్షణాలు


హైపో థైరాయిడ్‌లో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిలో ఆటంకం ఎదురౌతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లకు తీవ్రమైన నీరసం ఉంటుంది. అంతేకాకుండా చలి ఎక్కువగా ఉండటం, బరువు పెరగడం జరుగుతుంది. అయితే డైట్ కంట్రోల్ ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.


ఈ వ్యాధి బాధితులు వెన్న, కేక్, చాకొలేట్స్ వంటివాటికి దూరంగా ఉండాలి. వీటీని తినడం వల్ల బరువు మరింతగా పెరుగుతారు. అంతేకాకుండా..ఫ్యాట్ ఎక్కువగా ఉండే మాంస, బటర్, మేయోనీజ్ వంటివి తినకూడదు. దాంతోపాటు కెఫీన్ ఎక్కువగా ఉండేవి కూడా తీసుకోకూడదు. ప్రోసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రోసెస్డ్ ఫుడ్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా బీపీ పెరుగుతుంది. 


Also read: Greeny Vegetables Benefits: ఆకుపచ్చ కూరగాయలతో.. కేన్సర్ ఇతర వ్యాధుల్నించి సంరక్షణ, స్థూలకాయానికి చెక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook