Wild Sweetsop Benefits: ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా తగ్గుతుంది. ఈ బిజీ లైఫ్‌ కారణంగా ఆహారంలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే నేటి కాలంలో వయసు సంబంధం లేకుండా ప్రతిఒక్కరు కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పి వంటి సమస్యల బారిన పడుతున్నారు. దీని వల్ల పనులు చేసుకోవడం చాలా కష్టంగా మారుతుంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరోగ్యనిపుణులు ప్రకారం ఎముకలు, కీళ్లు దృఢంగా ఉండాలి అంటే కాల్షియంతో కూడిన ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం తగ్గడం వల్ల కీళ్ల నొప్పి సమస్యలు కలుగుతాయి. చాలా మంది కాల్షియం మందులను తీసుకుంటారు. కానీ మందుల కన్నా పండ్లు తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 


వర్షాకాలం చివరిలో మార్కెట్‌లో లభించే పండ్లలో సీతాఫలం ఒకటి. దీని ఎక్కువగా చవితి , దసరాలో ఎక్కువగా లభిస్తాయి. దీనిలోని గింజలను తీసేసి గుజ్జును తీసుకోవాలి.  ఇందులో ఉండే షోషకాలు శరీరానికి ఎంతో సహాయపడుతాయి. దీని పిల్లలు నుంచి పెద్దల వరకు ఇష్టంగా తినవచ్చు. 


ఈ సీతాఫలంలో విటమిన్ సి, ఏ, బీ, కెలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా ప్రోటీన్, ఫాస్పరస్‌, మెగ్నీషియం, మినలర్స్‌ అధికంగా దొరుకుతాయి. అయితే ఈ సీతాఫలంలో వీటితో పాటు కాల్షియం ఎక్కువగా దొరుకుతుంది. దీని తీసుకోవడం వల్ల ఎముకలు , కీళ్ళ నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.  


Also read: Washing Hair During Periods: పీరియడ్స్ సమయంలో తల స్నానం ఎందుకు చేయకూడదు?


సీతాఫలం కేవలం కాల్షియం మాత్రమే కాకుండా గుండెకు సంబంధించిన పోషకాలు కూడా ఇందులో అధికంగా ఉంటాయి. ఇందులో  మెగ్నీషియం, సోడియం, పోటాషియం ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పండు చెడు కొలెస్ట్రాల్‌ ను కరిగిస్తుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండులో  ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఈ పండు లభించే సమయంలో మీరు దీని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 
 


Also read: BP Warnings and Signs: రాత్రి వేళ నిద్రించేటప్పుడు బీపీ పెరిగితే ప్రాణాలు పోతాయా, ఏం చేయాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook