COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Weight Loss Tips At Home: కోవిడ్ తర్వాత ప్రస్తుతం చాలామంది వేగంగా బరువు పెరుగుతున్నారు. బరువు పెరిగిన వారు ఎంత సులభంగా తగ్గించుకుంటే అంత మంచిది.. లేదంటే దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గడానికి జీవనశైలిలో మార్పులతో పాటు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం చాలామంది బరువు తగ్గే క్రమంలో అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. ఇలాంటి ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులతో పాటు శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశాలు ఉన్నాయి. బరువు తగ్గే క్రమంలో ఆరోగ్య నిపుణులు సూచించిన ఆరోగ్యకరమైన చిట్కాలను పాటించడం ఉత్తమమని వారు చెబుతున్నారు.


బరువు తగ్గే క్రమంలో వ్యాయామం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పూట 45 నిమిషాల పాటు వాకింగ్ చేసి మరో 25 నిమిషాల పాటు యోగా ఆసనాలు వేయడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడుతున్న వారు బరువు తగ్గాలనుకుంటే తప్పకుండా ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీరంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి.


Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  


ఊబకాయం తగ్గించుకోవడానికి వ్యాయామాలు ఎంత ముఖ్యమో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చాలామంది డైట్ పేరిట ఆహారాలు తీసుకోవడం మానుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా శరీర బరువు తగ్గడానికి అంటే పెరిగే అవకాశాలు ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. బరువును తగ్గాలనుకునేవారు ప్రతిరోజు 300 కేలరీలను శరీరంలో బర్న్ చేసుకోవాల్సి ఉంటుంది.


ప్రతిరోజు వ్యాయామాలు చేసే క్రమంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చాలామందిలో వ్యాయామం చేసే క్రమంలో శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా నీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా చాలామంది ఎనర్జీ డ్రింక్స్ ను అతిగా తాగుతూ ఉంటారు. బరువు తగ్గే క్రమంలో ఇలా చేయడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Salaar Teaser: సలార్‌ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook