Immunity Boost At Home: ఈ తిప్ప ఆకు డికాక్షన్ తాగితే చాలు.. శరీరంలో ఒక రేంజ్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..
Immunity Boost At Home: వర్షాకాలంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ఈ సమయంలో తేమ తీవ్ర పెరుగుతుంది. దీని వల్ల ఆహారాలు కలుషితంగా మారుతాయి. అయితే ఈ తరుణంలో జాగ్రత్తగా ఉండడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు.
Immunity Boost At Home: వర్షాకాలంలో వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఎందుకంటే ఈ సమయంలో తేమ తీవ్ర పెరుగుతుంది. దీని వల్ల ఆహారాలు కలుషితంగా మారుతాయి. అయితే ఈ తరుణంలో జాగ్రత్తగా ఉండడం చాలా మేలని నిపుణులు తెలుపుతున్నారు. లేకపోతే వైరల్ ఫివర్, జలుబు, ఇతర వ్యాధులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తీసుకునే ఆహారాలపై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తిప్ప ఆకు డికాక్షన్ తీసుకోవాలి. ఈ డికాక్షన్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.
తిప్ప ఆకు డికాక్షన్ తయారీకి కావలసిన పదార్థాలు:
>>తిప్ప ఆకు
>>1 స్పూన్ పసుపు పొడి
>>2 అంగుళాల అల్లం
>>7-8 తులసి ఆకులు
>>1 అంగుళం దాల్చిన చెక్క
>>1/4 స్పూన్ నల్ల మిరియాలు పొడి
>>2 స్పూన్ తేనె
>>2 కప్పుల నీరు
తయారీ విధానం:
1. తిప్ప ఆకు డికాక్షన్ చేయడానికి.. ముందుగా ఒక పాత్రలో నీరు పోసి వాటిని వేడి చేయాలి.
2. ఇప్పుడు ఈ నీటిలో పసుపు పొడి, నల్ల మిరియాల పొడి వేసి మరిగించాలి.
3. ఇప్పుడు తిప్ప ఆకు, దాల్చిన చెక్క, అల్లం తురుము, తులసి ఆకులను అందులో వేయాలి.
4. సుమారు 5 నిమిషాల పాటు మరిగించాలి.
5. ఇప్పుడు ఒక పాత్రలో నీటిని ఫిల్టర్ చేయండి.
6. రుచికి అనుగుణంగా తేనె వేసి కలపాలి.
7. ఈ డికాక్షన్‌ని వారానికి 2-3 రోజులు తప్పనిసరిగా తాగాలి.
Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
Also read: Blood Pressure Control: బీపీ సమస్యలతో బాధపడుతున్నారా.. ఈ పండ్లను తినండి చాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook