Immunotherapy: కేన్సర్ వ్యాధిని తగ్గించే ఇమ్యునోథెరపీ చికిత్సలో ఉన్న రకాలు
ఇది వరకు కేన్సర్ వ్యాధికి చికిత్స ఉండేది కాదు.. కానీ ఇపుడు కేన్సర్ వ్యాధిని తగ్గించటానికి చాలా రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కేన్సర్ వ్యాధిని తగ్గించే ఇమ్యునోథెరపీ చికిత్సలో ఉన్న రకాలు అవెలా కేన్సర్ వ్యాధినిన్ తగ్గిస్తాయో ఇపుడు తెలుసుకుందాం!
Immunotherapy: ప్రపంచ వ్యాప్తంగా, ఎక్కువ మంది ప్రజలు ఏ వ్యాధి భారినపడుతున్నారంటే అది కేన్సర్ వ్యాధి, సామాజికంగా ఎన్ని రకాల జాగ్రత్తలు తెలిపిన దీని భారినపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది, ముఖ్యంగా భారతదేశంలో. ఒకప్పుడు కేన్సర్ భారినపడితే, మరణం ఒక్కటే మార్గం. అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి అనుగుణంగా వీటికి చికిత్సలు కనుగొనబడ్డాయి. ప్రస్తుత కాలంలో, 'ఇమ్యునోథెరపీ' అనే చికిత్స క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు ఒక ఊరటగా నిలుస్తున్నది.
'ఇమ్యునోథెరపీ' అనగా?
'ఇమ్యునోథెరపీ అనేది కేన్సర్ వ్యాధిని తగ్గించే, ఒక చికిత్స. ఈ చికిత్స వలన కేన్సర్ వ్యాధితో పోరాడే సామర్థ్యం మరియు శరీర పరిరక్షణల సామర్థ్యాన్ని పెంచటం ద్వారా ఈ వ్యాధిని తగ్గిస్తారు. నిజానికి ఈ థెరపీలో వాడే పదార్థాలను శరీర భాగాల నుండే తయారు చేస్తారు లేదా ప్రయోగశాలలో తయారు చేస్తారు, ఈ థెరపీలో వాడే పదార్థాలు కూడా శరీర నిరోధక వ్యవస్థ శక్తిని పెంచుతాయి.
కేన్సర్ వ్యాధిని తగ్గించే 'ఇమ్యునోథెరపీ' కూడా వివిధ రకాలుగా అందుబాటులో ఉంది. వాటిలో వాక్సిన్, ఇంటర్ల్యూకిన్స్, మోనోక్లోనల్ ప్రతిరోధకాలు (మోనోక్లోనల్ యాంటీబాడీస్), ఇంటర్ఫెరాన్స్ వంటి వివిధ రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటి గురించిన వివరాలు కింద పేర్కొనబడ్డాయి.
Also Read: viral Wedding Dance: అదిరిపోయిన బావ-మరదలు డ్యాన్స్.. నెటిజన్లతో ఈల వేయిస్తున్న వీడియో
మోనోక్లోనల్ యాంటీబాడీస్
శరీరంలో, బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లేదా పారసైట్స్ వంటి ప్రతిజనకాలకు (యాంటీజెస్) నిర్దారించబడిననపుడు, మన శరీర రోగ నిరోధక వ్యవస్థ ప్రతిరోధకాలను ఉత్పత్తి చేస్తుంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్, ప్రయోగశాలలో ఉత్పత్తి చెందించబడి రోగిలోకి ప్రవేశపెట్టబడతాయి మరియు ఇవి ప్రతిరోధకాల వలే పనిచేస్తాయి. ఇవి కొన్ని రకాల లక్ష్యాలను కలిగి ఉండి, వాటిని నిర్వహిస్తాయి. అవి:
కేన్సర్ కణాల వినాశనం
దీనిలో మోనోక్లోనల్ యాంటీబాడీస్ యాంటీ బాడీస్ శరీరంలో ఉన్న హానికర కేన్సర్ కణాలను గుర్తించి, వాటిని నాశనం చెందిస్తాయి. మోనోక్లోనల్ యాంటీబాడీస్, శరీరంలో ఉన్న అన్ని రకాల క్యాన్సర్ భాదిత కణాలను మాత్రమే గుర్తించి, వాటిని నాశనం చెందిస్తాయి. ఇవి ఆరోగ్యకర కణాలను ఏ విధంగానూ ప్రభావిత పరచవు.
కేన్సర్ కాణాలపెరుగుదల
కొన్ని సందర్భాలలో కేన్సర్ కణాలు, గ్రోత్ ఫ్యాక్టర్ రిసెప్టర్ ల ద్వారా, వాటి సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి, ఫలితంగా, కేన్సర్ కణాల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. మోనోక్లోనల్ యాంటీబాడీస్, ఈ రిసెప్టార్ లను గుర్తించి వాటిని నిరోధించి కేన్సర్ కణాల పెరుగుదలను నిలిపివేస్తాయి.
Also Read: Pushpa Movie Second Song: 'చూపే బంగారమాయెనే శ్రీవల్లి.. మాటే మాణిక్యమాయెనే'..పుష్ప మ్యూజికల్ బీట్
ఇంటర్ ఫెరాన్స్
ఈ రకమైన నాన్-స్పెసిఫిక్ ఇమ్యునోథెరపీ, కేన్సర్ కణాలతో పోరాడి, కేన్సర్ కణాల అభివృద్ధిని నెమ్మదిగా చేస్తాయి. ఇంటర్ ఫెరాన్స్, ప్రయోగశాలలో తయారు చేస్తే వీటిని ఇంటర్ ఫెరాన్ ఆల్ఫా, ఇంట్రాన్, అల్ఫెరాన్ అంటారు. ఈ రకాలు కేన్సర్ వ్యాధిని తగ్గించుటలో వాడే సాధారణంగా ఇంటర్ ఫెరాన్స్.
ఇంటర్ల్యూకిన్స్
ఇవి కేన్సర్ వ్యాధి సోకిన కణాలను మరియు కారకాలను నాశనం చేయటానికి, కణాలను ఉత్పత్తి చేస్తాయి. వీటిని ప్రయోగశాలలో తయారు చేస్తారు వీటిని ఇంటర్ల్యూకిన్స్-2. IL-2 లేదా అల్దేస్లెక్యూన్ (ప్రోల్యూకిన్) అంటారు. వీటిని మూత్రపిండ సంబంధిత క్యాన్సర్ లను తగ్గించుటకు వాడతారు.
కేన్సర్ వ్యాక్సిన్
కేన్సర్ వ్యాక్సిన్ లు, యాంటిజెన్ సంబంధిత ప్రోటీన్ లకు బహిర్గతం చెంది, వాటిని గుర్తుపట్టి మరియు ప్రోటీన్ మరియు వాటి సంబంధిత పదార్థాలను నాశనం చేసి, వాటి సంఖ్యలో అధికమవటాన్ని తగ్గిస్తుంది.
Also Read: Mahesh Koneru passed away: మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook