Mahesh Koneru passed away: మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణం

టాలీవుడ్ లో మరో విషాటం నెలకొంది.. మిస్ ఇండియా, 118, తిమ్మరుసు వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన మహేష్ కోనేరు గుండెపోటుతో మరణించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 12:47 PM IST
  • గుండెపోటుతో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి
  • 118, తిమ్మరుసు సినిమాలకు నిర్మాతగా మహేష్
  • మహేష్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్న ప్రముఖులు
Mahesh Koneru passed away: మరో విషాదం..గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు హఠాన్మరణం

 Mahesh Koneru passed away: సినిమా ఇండస్ట్రీని (Tollywood) విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.. అనారోగ్యం, కరోనా కారణంగా మరియు కొంత మంది వ్యక్తిగత కారణాల వలన బలవన్మారణాలకు పాల్పడుతున్నారు. ఉదయం ప్రముఖ టాలీవుడ్ నిర్మాత మహేష్ కోనేరు గుండెపోటుతో (Mahesh Koneru passed away) మరణించారు. విశాఖపట్నంలో (Vishakaptnam) ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. మరణించారు. 

మహేష్ కోనేరు (Mahesh Koneru) మరణంతో సినీ వర్గాలు షాక్ కు గురయ్యాయి. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కళ్యాణ్ రామ్ (Kalyan Ram) లకు పీఆర్‏గా (PR) పని చేసిన మహేష్ కోనేరు.. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పేరుతో తెలుగులో కొన్ని చిత్రాలను నిర్మించారు. 

Also Read: MAA Elections : నా రాజీనామాకి కారణాలను త్వరలోనే చెప్తా‌‌- ప్రకాశ్‌రాజ్‌

సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej Accident) యాక్సిడెంట్ అయిన తరువాత వరుసగా ఆసక్తికర ట్వీట్ లు చేసారు మరియు మిస్ ఇండియా (Miss India Movie), 118, తిమ్మరుసు (Thimmarusu Movie) వంటి సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. మహేష్ కోనేరు మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. 

జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ (Jr NTR emotional Tweet) చేస్తూ "మహేష్ మృతి వార్త విని షాక్ కి గురయ్యాను, బరువెక్కిన హృదయంతో చెబుతున్న... నా ఆప్త మిత్రుడు మహేష్ కోనేరు ఇక లేరు.. మహేష్ కుటుంబానికి నా సానుభూతి తెలుపుతున్న" అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. ప్రముఖులు కూడా మహేష్ కోనేరు మృతికి సంతాపం తెలియ చేస్తున్నారు. 

Also Read: AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా సంక్రమణ, తూర్పు గోదావరిలో అత్యధిక కేసులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

  

Trending News