Gut Health Tips: గట్ హెల్త్ అంటే మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యం గురించి తెలిపేది. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేయడం, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం, రోగనిరోధక శక్తిని పెంపొందించడం వంటి అనేక ముఖ్యమైన పనులు మన గట్ చేస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే గట్‌ హెల్త్ ఎందుకు అంత ముఖ్యం అనేది మనం తెలుసుకుందాం. మన శరీరంలో 70% రోగనిరోధక కణాలు కడుపులోనే ఉంటాయి. కాబట్టి గట్ హెల్త్ మన రోగ నిరోధక శక్తిని మెరుగుపరుచుతుంది. ఆరోగ్యనిపుణుల ప్రకారం గట్‌ను 'రెండవ మెదడు' అని కూడా అంటారు. గట్, మెదడు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. గట్ హెల్త్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గట్ హెల్త్ మన శక్తి స్థాయిలను నియంత్రిస్తుంది. అలాగే మన చర్మ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గట్ హెల్త్‌ను ఎలా మెరుగుపరుచుకోవచ్చు?


గట్ హెల్త్‌ను మెరుగుపరుచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి:


గట్‌ హెల్త్ మెరుగుపరచడంలో పండు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు ఎంతో సహాయపడుతాయి. ఇందులో  ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే  ప్రోబయోటిక్స్‌లు అధికంగా తీసుకోవడం మంచిది. ముఖ్యంగా  పెరుగు, కిమ్చి, సావర్‌క్రాట్ వంటి ఆహారాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. వీటితో పాటు ప్రీబయోటిక్స్‌లు ఎక్కువగా ఉండే వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఆస్పరాగస్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. గట్‌ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రాసెస్‌ చేసే ఆహారపదార్థాలు తీసుకోకూడదు. అందులోను అతిగా చక్కెర, తెల్ల పిండి, రెడ్ మీట్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ప్రతిరోజు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి తగినంత నీరు తాగండి. ఉదయాన్నే ధ్యానం, యోగా లేదా ప్రకృతిలో తిరగడం వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రోజూ కొంతసేపు వ్యాయామం చేయడం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఏవైనా జీర్ణవ్యవస్థ సమస్యలు ఉంటే, పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.


గట్ హెల్త్‌ను మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు:


మీరు ఏదైనా కొత్త ఆహారం లేదా సప్లిమెంట్‌ను తీసుకునే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించండి. అలాగే అలర్జీ ఉంటే దాని గురించి జాగ్రత్తగా ఉండండి. జీవనశైలిలో మార్పులు చేయడానికి కొంత సమయం పట్టవచ్చు కాబట్టి ఓపికగా ఉండండి.


ముఖ్యమైన విషయం: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే, మీ డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం.


Also Read: Huge King Cobra Video: వీడే అసలైన మగాడ్రా బామ్మర్ది.. 10 అడుగుల కింగ్ కోబ్రాను ఉత్తి చేతులతో పట్టుకున్నాడు.. వీడియో చూశారా? స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.