Cervical Cancer Vaccine: సెర్వైకల్ కేన్సర్‌కు తొలిసారిగా ఇండియాలో వ్యాక్సిన్ లాంచ్ కానుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జితేంద్ర సింహ్ రేపు అంటే సెప్టెంబర్ 1న దేశపు తొలి సెర్వైకల్ వ్యాక్సిన్ లాంచ్ చేయనున్నారు. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో తొలి సెర్వైకల్ వ్యాక్సిన్ అభివృద్ధి చెందింది. క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిలోమావైరస్ వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ లాంచ్ కావడం ఒక మర్చిపోలేని అనుభూతి అని..కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్‌పర్సన్ డాక్టర్ ఎన్ కే అరోరా తెలిపారు. 


సెర్వైకల్ కేన్సర్‌ను ఈ వ్యాక్సిన్ అద్భుతంగా నిరోధిస్తుందని..85-90 శాతం కేసుల్లో మంచి ఫలితాలొచ్చాయని డాక్టర్ ఎన్ కే అరోరా తెలిపారు. దేశంలోని యువతకు, అమ్మాయిలకు ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల 30 ఏళ్ల అనంతరం ఎదురయ్యే సెర్వైకల్ కేన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు. ప్రపంచ మార్కెట్‌లో ఈ వ్యాక్సిన్ కొరత ఉందని..ఇప్పుడు ఇండియా ఈ వ్యాక్సిన్ లాంచ్ చేయడంతో..దేశ అవసరాలు తీర్చుకోవచ్చని డాక్టర్ అరోరా చెప్పారు. 


ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం 2019 నుంచి ఇండియాలో 41 లక్షల 91 వేలమంది మహిళలు సెర్వైకల్ కేన్సర్ కారణంగా మృతి చెందారు. 


సెర్వైకల్ కేన్సర్ అంటే ఏమిటి


సెర్విక్స్‌లో ప్రారంభమయ్యే కేన్సర్ అయినందున దీనిని సెర్వైకల్ కేన్సర్‌గా పిలుస్తారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రీవెన్షన్ ప్రకారం మహిళలంతా సెర్వైకల్ కేన్సర్ ముప్పులో ఉన్నారని తెలుస్తోంది. 30 ఏళ్లు దాటాక ప్రతి మహిళకు సెర్వైకల్ కేన్సర్ సోకే అవకాశాలున్నాయి. దీర్ఘకాలం ఇన్‌ఫెక్షన్ కల్గించే హ్యూమన్ పాపిలోమావైరస్ అనేది సెర్వైకల్ కేన్సర్‌కు ముఖ్య కారణం. సెర్వైకల్ కేన్సర్‌ను త్వరగా గుర్తించగలిగితే..జీవన ప్రమాణాల్ని పెంచడం సాధ్యమే.


సెర్వైకల్, వెజైనల్, వల్వర్ కేన్సర్‌ల ప్రధాన కారణమైన హెచ్‌పీవీను ఈ వ్యాక్సిన్ నిరోధిస్తుంది. ఇండియా ఇప్పటి వరకూ హెచ్‌పీవీ వ్యాక్సిన్ విదేశీ తయారీదారులపై ఆధారపడి ఉంది. ఇక సెప్టెంబర్ 1 అంటే రేపట్నించి ఇండియా తొలి ఇండైజినస్ క్యూహెచ్‌పీవీ వ్యాక్సిన్ పొందనుంది. సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ జూలై 12న అనుమతిచ్చింది. 


Also read: Heart Attacks: ఇండియా మరో పదేళ్లలో గుండెపోటు వ్యాధులకు కేంద్రం కానుందా..ఏం జరుగుతోంది



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook