Memory Power Yoga: పిల్లల ఏకాగ్రత పెరగడానికి ప్రతిరోజు ఈ రెండు ఆసనాలు వేయించండి.. మెమరీ పవర్ కూడా బూస్ట్ అవుతుంది!
International Yoga Day 2023: పిల్లలు ఆరోగ్యంగా ఏకాగ్రతతో ఉండాలంటే తప్పకుండా ఈ యోగాసనాలను పిల్లల చేత వేయించాల్సి ఉంటుంది. ఈ ఆసనాల వల్ల దీర్ఘకాలిక వ్యాధులు దూరమవ్వడమే కాకుండా శరీరానికి చాలా రకాలు ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లల చేత ఏయే ఆసనాలను వేయించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు తెలుసుకుందాం.
International Yoga Day 2023: ఆధునిక జీవనశైలి, కుటుంబంలో తగాదాల కారణంగా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. దీని కారణంగా చాలామంది పిల్లల్లో ఏకాగ్రత నశిస్తోంది. దీంతో పిల్లలు చదువుల్లో రాణించలేకపోతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన కూడా పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడే పిల్లల చేత తప్పకుండా చిన్నచిన్న యోగాసనాలను వేయించాలని నిపుణులు చెబుతున్నారు. క్యాట్ పోజ్ తో పాటు ట్రీపోజ్ వంటి సులభతర ఆసనాలను పిల్లల చేత వేయించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, మానసిక ప్రశాంతత పొందుతారని నిపుణులు పేర్కొన్నారు.
సూర్యాసనాల ప్రాముఖ్యత:
ప్రతిరోజు పిల్లలు సూర్యాసనాలు వేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ ఆసనాలను ఉదయం పూట వేయడం వల్ల పిల్లల ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా శరీరం ఫిట్ గా తయారవ్వడమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రతిరోజు యోగాసనాలు వేసే పిల్లల్లో 80 శాతం ఏకాగ్రత పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.
Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
బకాసన ఆసనం:
ఈ ఆసనాన్ని ఇంగ్లీషులో క్రోపోజ్ అంటారు. ఈ ఆసనాలు వేయడానికి ముందుగా యోగ మ్యాట్ పరుచుకొని దాని పైన వంగాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేతులపై మొత్తం మీ బలాన్ని వినియోగించి.. కాళ్లతో సహా శరీరాన్ని పైనకి లేపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ శరీరం గాల్లో ఉండగానే మోకాళ్ళను చంకలోకి ఆనివ్వాల్సి ఉంటుంది. ఇలా ఆనిచ్చిన తర్వాత సుమారు ఐదు నుంచి పది సెకండ్ల పాటు ఉండాలి. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా వేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
శీర్షాసనం:
ఈ శీర్షాసనం వేయడం వల్ల కూడా పిల్లలు ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆసనాన్ని వేయడానికి ముందుగా గోడ లేదా కుర్చీలు సపోర్టును తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆసనం వేసే క్రమంలో ముందుగా వజ్రాసనం స్థానంలో ఉండి.. ఆ తర్వాత గోడ సపోర్ట్ తీసుకుని, చేతులను కింద పెట్టి కాళ్లను నిటారుగా పైనకు లేపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ తల కింద చేతులు పెట్టి ఇలా పది సెకంన్ల పాటు ఉండాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో రక్తప్రసరణ కూడా పెరుగుతుంది. ఈ ఆసనం వేయడం వల్ల జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.
Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook