Drinking Water While Eating Food: అన్నం తినే ముందు నీళ్లు తాగితే మంచిదా ? అన్నం తిన్న తరువాత మంచిదా ?
Drinking Water While Eating Meals : భోజనం చేసేటప్పుడు మంచి నీళ్లు తాగొచ్చా లేదా ? మంచి నీరు అన్నం తినడానికి ముందు తాగితే మంచిదా ? లేక అన్నం తినేటప్పుడు తాగితే మంచిదా ? లేదంటే అన్నం తిన్న తరువాతే నీరు తాగాలా ? ఈ మూడింటిలో ఏ అలవాటు మంచిది, ఏది సమస్యకు దారి తీస్తుంది ?
Drinking Water While Eating Meals : మనిషి మనుగడకు తాగు నీరు అనేది చాలా ముఖ్యమైన అవసరం. నీరు లేనిదే మనిషే కాదు.. సమస్త జీవకోటి లేదు. మంచి నీరు తాగే పద్ధతిలో తాగితేనే అది ఆరోగ్యం.. లేదంటే అది కూడా అనారోగ్యమే అని నిపుణులు అంటుంటారు. అందుకే అన్నం తినేటప్పుడు నీరు తాగే పద్ధతిపై చాలామందిలో చాలా రకాల సందేహాలు ఉన్నాయి. భోజనానికి ముందు నీరు తాగితే అనారోగ్యం అని కొందరంటే.. భోజనం తరువాత తాగితేనే ఇబ్బంది కలుగుతుంది అని ఇంకొందరు వాదిస్తారు. ఇంతకీ అసలు వాస్తవం ఏంటి ? హెల్త్ కేర్ ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
భోజనానికి ముందు నీరు తాగే అలవాటు :
భోజనానికి ముందు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయి. ఇది శరీరానికి తగినంత నీరు సరఫరా చేసి శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా భోజనానికి ముందు తాగే నీరు పొట్టలో జీర్ణ వ్యవస్థను సిద్ధం చేస్తుంది. మనం భోజనానికి ముందు నీరు తాగినప్పుడు, పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఫలితంగా అవురావురుమని అతిగా తిని స్తూలకాయం తెచ్చుకునే ప్రమాదం ఉండదు. అందుకే భోజనానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగితే మంచిదే అని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
భోజన సమయంలో నీరు తాగే అలవాటు వల్ల కలిగే పరిణామాలు :
భోజనం చేసేటప్పుుడు నీరు తాగడం వల్ల ఆహారం మింగడం తేలిక అవడంతో పాటు తేలిగ్గా జీర్ణం అవుతుంది అని చాలామంది చెబుతుంటారు. కానీ వాస్తవానికి భోజనం చేసేటప్పుడు అధిక మొత్తంలో నీరు తాగితే పొట్టలో ఆహారాన్ని అరిగించుకునేందుకు సహాయపడే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆమ్లాలు పలుచనపడి జీర్ణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. భోజనం మింగుడు పడటం కోసం, లేదా గొంతు, నోరు పొడి బారకుండా ఉండటం కోసం చిన్న చిన్న సిప్స్ చేసినంత వరకు ఇబ్బంది లేదు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
భోజనం తర్వాత నీరు తాగే అలవాటు వల్ల ఏమవుతుంది ?
భోజనం తర్వాత నీరు తాగడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయి. నోట్లో దంతాల మధ్య మిగిలిన ఆహార కణాలను తొలగించి, నోటిని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు దంతాల్లో పుప్పి రావడం వంటి సమస్యలను నివారిస్తుంది. అన్నం తిన్న తర్వాత నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ సాఫీగా జరిగి మలబద్ధకాన్ని నివారిస్తుంది. అయితే, కొంతమందిలో భోజనం చేసిన వెంటనే నీరు తాగితే బరువు పెరగడం లేదా ఆహారం జీర్ణం కాదు అనే అపొహ ఉంటుంది. కానీ అది నిజం అని చెప్పే శాస్త్రీయ ఆధారాలు ఏవీ లేవనేది హెల్త్ కేర్ ఎక్స్‌పర్ట్స్ వాదన.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న వివరాలు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటాయి. వీటిని స్వీకరించానికి ముందు వైద్య సలహా తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని ZEE NEWS ధృవీకరించడంలేదు.)
ఇది కూడా చదవండి : Precautions for eye flu or Conjunctivitis: కండ్ల కలక రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి