Jackfruit Benefits: పనస పండు తింటున్నారా? ఇవి తెలుసుకోండి..
Jackfruit Benefits: పనస పండు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి వివిధ రకాల పోషకాలు లభిస్తాయి. క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె సమస్యలు దూరమవుతాయి.
Jackfruit Benefits: పనస పండులో శరీరానికి కావాల్సిన బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి కలిగిస్తాయి. అంతేకాకుండా ఇందులో బాడీని అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. కాబట్ట రోజు ఉదయాన్నే తినడం వల్ల శరీరంలోకి కణాలు మెరుగుపడతాయి. అలాగే పనసలో విటమిన్ A, C, రైబోఫ్లేవిన్ వంటి పోషకాలు లభిస్తాయి. శరీర నిర్మాణాకి కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి..
పనస పండు తినడం వల్ల కలిగే లాభాలు:
జీర్ణవ్యవస్థకు మేలు:
పనస పండులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కాబట్టి రోజు తినడం వల్ల జీర్ణక్రియ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండె ఆరోగ్యానికి:
పనస పండులో పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తాయి. క్రమం తప్పకుండా ఆహారాల్లో తీసుకోవడం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
క్యాన్సర్ కణాలకు చెక్:
పనస పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను నష్టం నుంచి రక్షిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్‌ల నుంచి విముక్తి కలిగించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
పనస పండులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది ఎక్కువసేపు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజు తీసుకునే డైట్‌లో పనస పండును తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా సులభంగా బరువు తగ్గుతారు.
చర్మ ఆరోగ్యానికి:
పనస పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ముడతలు పడకుండా చర్మాన్ని రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.