Turn White Hair to Black: ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవన శైలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలకు గురవుతున్నాము. ముఖ్యంగా మనలో  చాలా మంది జుట్టు తెల్లగా మారుతుంది అది కూడా చిన్న వయసులోనే.. సాధారణంగా జుట్టు 40 ఏళ్ల పైబడిన వారిలో వస్తుంది కానీ ఇపుడు 5 ఏళ్ల పై బడిన వారిలో కూడా తెల్లజుట్టు కనపడుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి మనం తినే ఆహారంలో పోషకాల లోపం వలన తెల్ల జుట్టు వస్తే.. మరికొంత మందిలో జన్యు పరంగా సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇపుడు పాటిస్తున్న ఆనారోగ్యక ఆహార పదార్థాల సేకరణ వలన శరీరానికి కావలసిన పోషకాలు అందించబడవు. దాని కారణంగానే.. వెంట్రుకలు రాలటం.. వెంట్రుకలు తెల్లబటం.. పలుచబడటం వంటివి జరుగుతాయి. 


మనలో చాలా మంది చిన్న వయసులో జుట్టు తెల్లబడితే.. ఆ సమస్య నుండి ఉపశమనం పొందటానికి గాను.. అల్లోపతి మందులు, పద్ధతులు వాడుతూ ఉంటారు. కానీ ఇంటి చిట్కాలను పాటించటంతో జుట్టును నల్ల బరుచుకోవచ్చు. ఈ చిట్కాలను పాటిస్తే.. మూలాల నుండి నల్లబడతాయి. 


మన వంటింట్లో ఉండే బెల్లం, మెంతులు జుట్టును నల్లబరుస్తాయని మీకు తెలుసా..? అవును నిజంగానే వీటి వాడకంతో జుట్టు పూర్తిగా నల్లబడుతుంది.బెల్లంతో మెంతులను కలిపి ఉపయోగించడం వలన జుట్టు సులభంగా నల్లబడడం మొదలవుతుంది. ఆరోగ్య కరమైన జీవన శైలి, జుట్టు సంరక్షణ చిట్కాలు మరియు బెల్లంతో పాటు మెంతులను కలిపి తినడం వల్ల తెల్ల వెంట్రుకల నుండి విముక్తి లభిస్తుంది. తెల్ల జుట్టుని నల్ల బరిచే ఇంటి చిట్కాల గురించి ఇపుడు తెలుసుకుందాం.  


Also Read: Shani Nakshatra Parivartan: శని నక్షత్ర సంచారంతో ఈ రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు..ముట్టింది బంగారం అవ్వడం ఖాయం!


బెల్లంతో పాటు మెంతులు
చిన్న వయస్సులో వెంట్రుకలు తెల్లబడితే.. బెల్లం మరియు మెంతులని ఉపయోగించి నల్లబరుచుకోవచ్చు. దీని కోసం మెంతులను పొడిలా చేసుకొని రోజు ఉదయాన్నే ఖాళీ కడుపు తో బెల్లంతో పాటు ఒక చెంచా మెంతుల పొడిని కలిపి తినాలి. ఈ ఇంటి చిట్కా తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ బెల్లం- మెంతుల మిశ్రమం కొత్త తెల్ల వెంట్రుకలు రాకుండా ఆపుతుంది. 


చిన్న వయస్సులో వెంట్రుకలు ఎందుకు తెల్లబడతాయి.. ?  
చిన్న వయస్సులో వెంట్రుకలు తెల్లబడడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు.. జన్యు సంక్రమణ, ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, థైరాయిడ్, శరీరంలో విటమిన్ బి-12 లేకపోవడం, ధూమపానం వంటి వాటి కారణంగా జుట్టు తెల్లబడుతుంది. కావున తెల్ల వెంట్రుకల సమస్యని నివారించడానికి ఈ  పైన పేర్కొన్న వాటికి దూరంగా ఉంటానికి ప్రయత్నిచాలి.


Also Read: IND Vs BAN Dream11 Prediction Today Match: బంగ్లాదేశ్‌నూ చితక్కొడతారా..? మరికాసేపట్లో పోరు.. డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..