Jaggery Tea Benefits: చలి కాలంలో వాతావరణంలోని తేమ ఒక్కసారిగా పెరిగిపోయి..చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడతారు. అంతేకాకుండా కొంతమందిలో చలి కారణంగా వ్యాయామాలు చెయ్యకపోవడం కారణంగా బద్ధకం కూడా పెరుగుతుంది. దీనికి కారణంగా ఫిట్‌నెస్‌ కోల్పోయి..ఒక్కసారిగా బరువు పెరుగుతారు. ఇలాంటి సమయంలో ప్రతి రోజు బెల్లం టీలను తాగాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రతి రోజు బెల్లం టీలను తాగడం వల్ల శరీరానికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ బెల్లం టీలను ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
బెల్లం టీని ప్రతి రోజు తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీని కారణంగా జీర్ణక్రియ బలంగా మారుతుంది. కాబట్టి ప్రతి రోజు ఉదయం పూట తప్పకుండా బెల్లం టీని తీసుకోవాల్సి ఉంటుంది. 


రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది:
బెల్లంలో అనేక రకాల పోషకాలు లాభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహరంలో బెల్లాన్ని వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా ఇందులో కాల్షియం, పొటాషియం, విటమిన్ బి, ఐరన్‌లు లభిస్తాయి. దీని కారణంగా శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పోషకాల లోపం నుంచి ఉపశమనం లభిస్తుంది.


బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
చలికాలంలో బరువు తగ్గడం అంత సులభం కాదు..కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు తీసుకునే ఆహారాలపై తప్పకుండా ఫోకస్‌ పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే శరీర బరువు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి శరీరంలోని కేలరీలు తగ్గడానికి ప్రతి రోజు బెల్లం టీని తీసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  


పీరియడ్స్ పెయిన్ నుంచి రిలీఫ్‌:
ప్రతి రోజు బెల్లం టీని తాగడం వల్ల శరీరానికి అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా పీరియడ్స్‌ కారణంగా వచ్చే నొప్పులు కూడా ఈ టీని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకుండా పొట్ట నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 


శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది:
బెల్లం టీలో శరీరాన్ని డిటాక్సిఫై చేసే చాలా రకాల గుణాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ టీని తాగడం వల్ల ఊపిరితిత్తులతో పాటు ప్రేగులు, పొట్ట సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి.


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి