Jamun Fruit Benefits: నేరేడు పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. దీనిపై ఉప్పు చల్లుకుని తింటే పులుపు, తీపి, ఉప్పు నాలుకకు చాలా రుచిని అందిస్తుంది. ఇది శరీరానికి మేలు చేయడమే కాకుండా వ్యాధులకు దివ్యౌషధంల పని చేస్తుంది. దీని బెరడును అనేక వ్యాధులకు ఔషదంలా ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొంది. ఈ పండు మధుమేహ వ్యాధిని నియంత్రించడానికి ఎంతగానో కృషి చేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేరేడు పండుకు జామున్ పండు అని కూడా పేరు ఉంది. జామున్‌ పండు ద్వారానే భారత్‌లో ఉండే ఓ దీవికి  జంబూ ద్వీపం అని పేరు వచ్చిందని పురాతన చరిత్ర చెబుతుంది. పురాణాల్లో జంబూద్వీపం పేరు పదే పదే వస్తుంది. జామున్ చెట్టు, పండ్లు భారతదేశంలో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయని స్పష్టమవుతుంది. నిజానికి నేరేడు పండు భారతదేశం చుట్టూ ఉన్న అన్ని దేశాల్లోనూ దొరుకుతుంది.అయితే ఈ పండు చాలా కాలం తరువాత ఇతర దేశాలకు దర్శనమిచ్చిది. 1911 సంవత్సరంలో  యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్(United States Department of Agriculture) తెలిపిన వివరాల ప్రకారం..దీనిని యూఎస్‌లోని ఫ్లోరిడా నగరంలో మొదట వెలుగు చూసినట్లు సమాచారం. తర్వాత పోర్చుగీసులు భారతదేశం నుంచి వెళ్లినప్పుడు బ్రెజిల్‌కు ఈ పండు చేరుకుంది.


ఈ పండు గురించి 1889లో మాడెన్ అనే రచయిత  తన 'The Useful Native Plants of Australia' అనే బుక్‌లో ఈ పండ్ల ప్రత్యేకతను వివరించారు. అంతే కాకుండా ఈ పండ్లను మొదట భారత్‌లో అధికంగా తినే వారని ఆ బుక్‌లో పేర్కొన్నారు. నేరేడు పండు తినడానికి రుచిగా ఉండటమే కాదు.. ఇందులో గొప్ప ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీని గింజల పొడి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. పురాతన ఆయుర్వేద గ్రంథం 'చరకసంహిత'లో ఔషధ యోగమైన 'పుష్యనుగ-చూర్ణ'లో బెర్రీల గింజలను కలపాలని పేర్కొన్నారు. ఇది జీర్ణక్రియను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని ఆయుర్వేద గ్రంథంలో తెలిపారు.


Also Read: Coconut Water Benefits: వేసవిలో కొబ్బరినీళ్లు తాగితే ఈ అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు..!!


Also Read: Diabetes Patient: షుగర్ పేషెంట్స్‌ ఈ పండ్లను తింటే ప్రమాదమే..!!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి