కిడ్నీల విలువ అనేది అవి పాడైతేనే తెలుస్తుందంటారు వైద్యులు. మనిషి శరీరంలో అంత ముఖ్యమైన భాగమది. రక్తంలో ఉండే వ్యర్ధాల్ని ఫిల్టర్ చేసేది రక్తాన్ని శుద్ధి చేసేది కిడ్నీలే కావడం విశేషం. అందుకే కిడ్నీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కిడ్నీల పనితీరులో ఏ మాత్రం సమస్య తలెత్తినా మొత్తం శరీరంపై  ఆ ప్రభావం పడుతుంది. కిడ్నీ ఇన్‌ఫెక్షన్, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యల వల్ల ప్రాణాలకు ముప్పుంటుంది. అందుకే కిడ్నీవ్యాధి లక్షణాల్ని ఎప్పటికప్పుపుడు గుర్తించాల్సి  ఉంటుంది. కిడ్నీలు పాడైతే ఎలాంటి లక్షణాలు కన్పిస్తాయో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలసట, బలహీనత


కిడ్నీల ఫిల్టరేషన్ ప్రక్రియలో ఏదైనా ఆటంకం ఏర్పడితే శరీరంలో విష లేదా వ్యర్ద పదార్ధాలు పేరుకుపోతాయి. అంటే బాడీ టాక్సిన్ అవుతుంది. ఫలితంగా అలసట, వీక్నెస్ సమస్యలు తలెత్తుతాయి. అందుకే అకారణంగా అలసటగా ఉంటే కిడ్నీ వ్యాధి కావచ్చు.


నిద్రలేమి


కిడ్నీ పనితీరులో సమస్య ఉంటే ఆ ప్రభావం నిద్రపై పడుతుంది. ఫలితంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుకే సకాలంలో అప్రమత్తం కావాలి. నిద్రలేమి ఇతర వ్యాధులకు దారితీస్తుంది.


దురద


కిడ్నీలో సమస్య ఏర్పడితే శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగకుండా వ్యర్ధాలన్నీ రక్తంలోనే పేరుకుపోతాయి. ఫలితంగా చర్మం దురదగా ఉంటుంది. 


యూరిన్ రంగులో తేడా


కిడ్నీలు పాడవడం వల్ల ప్రోటీన్లు పెద్దఎత్తున బయటకు వచ్చేస్తాయి. యూరిన్ రంగు పసుపు లేదా గోధుమ రంగులో ఉంటుంది. చాలా సందర్బాల్లో మూత్రమార్గం నుంచి రక్తం కూడా కారుతుంది. ఈ పరిస్థితి తలెత్తితే వెంటనే అప్రమత్తమై వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. 


ముఖ, కాళ్లలో వాపు


శరీరం నుంచి సోడియంను బయటకు పంపించడంలో కిడ్నీలు విఫలమైతే శరీరంలో పేరుకుపోతుంది. ఫలితంగా ముఖం,కాళ్లలో వాపు కన్పిస్తుంది. ఈ లక్షణం కన్పిస్తే వెంటనై వైద్యుడిని సంప్రదించాలి.


మజిల్స్ స్ట్రెచ్


కిడ్నీలు పాడైనప్పుడు కాళ్లు కండరాలు లాగుతుంటాయి. ఎందుకంటే సోడియం, కాల్షియం, పొటాషియం లేదా ఇతర ఎలక్ట్రోలైట్స్ స్థాయిలో అంతరం వల్ల జరుగుతుంది. 


శ్వాసలో ఇబ్బంది


మీకు తరచూ శ్వాస ఇబ్బందిగా ఉంటే కిడ్నీ లక్షణం కావచ్చంటున్నారు వైద్యులు. ఎందుకంటే రీత్రోపైటీన్ హార్మోన్ ఉత్పత్తిపై కిడ్నీల పనితీరు ప్రభావం చూపిస్తుంది. ఈ హార్మోన్ సహాయంతోనే రెడ్ బ్లడ్ సెల్స్ తయారౌతాయి.


Also read: High Blood Pressure: ఈ డికాక్షన్‌తో రక్తహీనత, బీపీ సమస్యలకు 10 రోజుల్లో చెక్‌, నమ్మట్లేదా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook