How To Reduce High Blood Pressure: కొత్తిమీర ఆకుల్లో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో దీని ప్రయోజనాల గురించి క్లుప్తంగా పేర్కొన్నారు. అందుకే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారిని కొత్తిమీర ఆకులతో తయారు చేసిన జ్యూస్‌ను తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఇందులో ఉండే గుణాలు స్పాస్మోడిక్ నొప్పులను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా అపానవాయువుతో పాటు చాలా రకాల పొట్ట సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. యూరిక్ యాసిడ్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రసం, డికాక్షన్ తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్తిమీర ఆకుల డికాక్షన్ తయారీ పద్ధతి:
కొత్తిమీర ఆకులను తీసుకొని వాటిని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కడిగిన తర్వాత ఆకులను ఉప్పు నీటిలో 30 నిమిషాలు నానబెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే పురుగుమందులు, ఇతర హానికర రసాయనాలు కూడా తొలగిపోయి. కొత్తిమీర ఆకులను ఉపయోగించే ముందు మూలాలను కత్తిరించండి. ఆకులను 2 గ్లాసుల నీటిలో వేసి 10 నిమిషాలు ఉడకబెట్టండి. తర్వాత ఒక గ్లాసులో వడకట్టుకున్న డికాక్షన్ పోయాలి. ఈ డికాక్షన్‌ను ప్రతి రోజూ ఉదయం పూట తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
కొత్తిమీర డికాక్షన్ ప్రయోజనాలు:
1. కొత్తిమీరలో లినోలెయిక్ యాసిడ్, సినియోల్ లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో ఆర్థరైటిస్, యాంటీ రుమాటిక్ ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మపు మంటను తగ్గించడానికి సహాయపడుతుంది.
2. కొత్తిమీర రసం ప్రతి రోజు తాగడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది. అంతే కాకుండా గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
3. కొత్తిమీరలో క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి సులభంగా ఎముకలను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది.
4. కొత్తిమీర గింజల్లో ఐరన్ కూడా లభిస్తుంది. ఈ గింజలతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగితే రక్తహీనత, బీపీ సమస్యలు కూడా తగ్గుతాయి.
ఇది కూడా చదవండి : Ponguleti Srinivas Reddy: ఢిల్లీకి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. కీలక ప్రకటన రానుందా ?
ఇది కూడా చదవండి : Bandi Sanjay: సంతకాల్లేకుండా ప్రధానికి లేఖలు.. అసలు విషయం బయటపెట్టిన బండి సంజయ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook