Foods to avoid for kidney stones problem: మానవ శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు (మూత్ర పిండాలు) ఒకటి. శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి.. మనిషి ఆరోగ్యంగా ఉంచడంలో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీల పని తీరులో మార్పు వస్తే.. సమస్యలు మొదలవుతాయి. చెడు ఆహారపు అలవాట్లు, నీరు తక్కువగా తాగేవారి కిడ్నీలలో తొందరగా రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. కిడ్నీలలో ఏర్పడే రాళ్లతో బాధపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లక్షణాలు ఇవే:
కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ముఖ్య కారణం శరీరంలో నీటి శాతం తక్కువగా ఉండడమే. అంతేకాదు యూరిన్‌లో ఎక్కువ యాసిడ్ ఉండటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్ వంటివి కూడా ఈ సమస్యకి మరో కారణం. యూరిక్ ఆమ్లాలు, కాల్షియం మరియు ఖనిజాల కలయికతో మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడతాయి. ఈసమస్య ఉన్నవారికి పొత్తి కడుపులో ఎప్పుడూ నొప్పి వస్తుంది. ఒక్క్కోసారి అయితే భరించలేని నొప్పి ఉంటుంది. మూత్ర విసర్జన చేసేటప్పుడు కూడా నొప్పి ఉంటుంది. మరోవైపు తరచుగా మూత్ర విసర్జన, వికారం, బలహీనత, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి. 


కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి:
కిడ్నీలో రాళ్లు అనేది సర్వ సాధారణ సమస్య అయినప్పటికీ.. నిర్లక్ష్యం చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఏ ఆహార పదార్థాలు తినాలో, ఏవి తినకూడదో ఓసారి తేలుకుందాం. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే తరచూ నీళ్లు తాగాలి. రోజులో కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. కిడ్నీలో రాయి ఉంటే.. అది పెరగకుండా ఉండడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినాలి. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే.. సిట్రిక్ యాసిడ్ ఉన్న నారింజ, నిమ్మ, మోసాంబి లాంటి పండ్లను తినాలి. 


పుచ్చకాయ, చెరకు, దానిమ్మ రసం తీసుకోవాలి: 
కొబ్బరి నీళ్లలో పీచు పదార్థం అధిక స్థాయిలో ఉంటుంది. ఇది రాళ్లను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. పప్పు దినుసులతో కూడిన కూరగాయలు తినడం కూడా మేలు చేస్తుంది. అడవి క్యారెట్లు, చక్కెర దుంపలు వంటి మూలికలు రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి. బఠానీలు, యాపిల్స్, ఆస్పరాగస్, పాలకూర మరియు బేరిలను ఆహారంలో చేర్చవచ్చు. చెరకు రసం, దానిమ్మ రసం  మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది. రాజ్మా, డాండలియన్ టీ, తులసి, లెమన్, ఆలివ్ ఆయిల్, పుచ్చకాయ, ఖర్జూరాలు, కీర దోసకాయ, చెర్రీలు నిత్యం తీసుకోవాలి. 


టమోటాలు, యాపిల్స్ తినొద్దు: 
కిడ్నీలో రాళ్లు ఉంటే అధిక ఆక్సలేట్ పండ్లు మరియు కూరగాయలను తీసుకోకూడదు. టమోటాలు, యాపిల్స్, బచ్చలికూరను తీసుకోవద్దు. గుడ్లు, మాంసం మరియు చేపలకు దూరంగా ఉండాలి. పాలతో చేసిన వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెరుగు, వెన్న వంటి వాటిని తక్కువగా తినాలి. ముల్లంగి, క్యారెట్, వెల్లుల్లి, ఉల్లిపాయలలో సోడియం మరియు ఆక్సలేట్ అధిక స్థాయిలో ఉంటాయి కాబట్టి వీటిని తీసుకోవద్దు. మద్యం అస్సలు తాగకూడదు.


Also Read: వ‌న్‌ప్ల‌స్‌ వై1 టీవీపై రూ. 6500 తగ్గింపు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా!


Also Read: షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. రెండో స్థానంలో ఎంఎస్ ధోనీ!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook