Kidney Stones: కిడ్నీలకు సంబంధించి మనం తరచూ వినే మాట కిడ్నీలో రాళ్లు ఏర్పడటం. వివిధ రకాల ఖనిజాలు పేరుకుపోవడం ద్వారా కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. దీనినే కిడ్నీ స్టోన్స్ అంటారు. కిడ్నీ స్టోన్స్‌కు సంబంధించి ప్రాచుర్యంలో ఉన్న 4 అవాస్తవాలు మిమ్నల్ని ప్రమాదకర స్థాయికి తీసుకువెళ్లవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కిడ్నీలు మనిషి శరీరంలోని అత్యంత శక్తివంతమైన అంగాల్లో ఒకటి. రక్తాన్ని శుభ్రపర్చడం కిడ్నీల ప్రధాన విధి. అందుకే కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తుండాలి. కిడ్నీ స్టోన్స్ సమస్య వల్ల నొప్పి తీవ్రంగా ఉంటుంది. మూత్రంలో రక్తం, ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. మరోవైపు కిడ్నీ స్టోన్ విషయంలో కొన్ని అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అవాస్తవాల కారణంగా ఒక్కోసారి పరిస్థితి ప్రమాదకరంగా మారిపోతుంది. అవేంటో పరిశీలిద్దాం.


కిడ్నీ స్టోన్స్ అనేవి కేవలం పురుషుల్లో ఏర్పడతాయనే అవాస్తవం ప్రచారంలో ఉంది. వాస్తవం ఏంటంటే మహిళలతో పోలిస్తే ఈ సమస్య పురుషుల్లో ఎక్కువ. కానీ మహిళలకు కూడా ఈ సమస్యకు గురవుతుంటారు. ఇటీవల గత కొద్దికాలంగా మహిళల్లో కూడా కిడ్నీ స్టోన్స్ సమస్య పెరుగుతోంది. 


బీరు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ తొలగిపోతాయనే విషయం ప్రచారంలో ఉంది. ఇది పూర్తిగా అబద్ధం. వాస్తవానికి బీరు తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ సమస్య మరింత పెరగవచ్చు. బీరు అనేది యూరిన్‌లో కాల్షియం శాతాన్ని పెంచుతుంది. దాంతో రాళ్లు ఏర్పడే ముప్పు పెరుగుతుంది. 


కిడ్నీ స్టోన్స్ కేవలం సర్జరీతోనే తొలగించవచ్చని చాలామంది భావిస్తుంటారు. కానీ వాస్తవం అది కాదు. చాలావరకూ కిడ్నీ స్టోన్స్ అనేవి చిన్న పరిమాణంలో ఉండటం వల్ల సహజసిద్ధంగానే తొలగిపోతాయి. మందుల ద్వారా వీటిని కరిగించి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారు. కేవలం పెద్ద పెద్ద రాళ్లు లేదా ఇరుక్కుపోయిన రాళ్లను మాత్రమే సర్జరీ ద్వారా తొలగిస్తారు. 


కిడ్నీ స్టోన్స్‌కు చికిత్స లేదని ఇంకొంతమంది అనుకుంటుంటారు. కానీ ఇది కూడా అబద్ధం. తిరిగి సాధారణ పరిస్థితి రావచ్చు. అయితే డైట్, లైఫ్‌స్టైల్‌లో మార్పులు ఉండాలి. అప్పుడే ముప్పు తగ్గించవచ్చు. దీనికోసం తగినంత నీళ్లు, ఉప్పు తగ్గించడం, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం వంటివి పాటించాల్సి ఉంటుంది. 


Also read: AP Cabinet Meet 2024: ఎన్నికల వేళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం , ఐఆర్ ప్రకటన ఇతర వరాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook