The right time to eat bananas: అరటి పండ్లు.. సాధారణంగా ఎక్కువ మందికి అందుబాటులో ఉంటాయి. లభ్యతతో పాటు ధర కూడా ఛౌకగా ఉండటం వల్ల.. దాదాపు ప్రతి ఒక్కరు అరటి పండ్లను తింటారు. ఇందులో వివిధ రకాల పోషకాలు ఉంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరి అరటి పండ్లు ఎప్పుడు తినాలి? మంచి అరటి పండ్లను ఎలా గుర్తించాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.


అరటి పండ్లలో ఉండే పోషకాలు..


అరటి పండ్లలో పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో పీచు కూడా ఉంటుంది. ఇక విటమిన్లు సీ, బీ6 వంటివి పుష్కలంగా ఉంటాయి.


అరటి పండ్లు తినడం వల్ల ఉపయోగాలు..


గుండె జబ్బులు ఉన్నవారు రోజూ అరటి పండ్లు తినడం వల్ల మేలు జరుగుతుంది.


ఇందులో ఉండే పొటాషియం ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కణ నష్టాన్ని తగ్గిస్తాయి. దీని వల్ల నిద్ర లేమి సమస్యలు కూడా తగ్గుతాయి. అరటి పండ్లలో ఒత్తిడిని దూరం చేస్తే సహజ రసాయానాలు కూడా ఉంటాయి.


అరటిలో బరువును తగ్గించడంతో పాటు మలబద్ధకాన్ని నివారించే అద్భుత ఔషద గుణలున్నాయి.
అరటి పండు పైల్స్ తగ్గడంలో సహాయపడుతుంది. పైల్స్ సమస్య ఉన్నవారికి సాంత్వన చేకూరుస్తుంది. పైల్స్ బాధితులు అరటి పండు తినడం వల్ల మల విసర్జన సాఫీగా అయ్యి రక్తస్రావం వంటి సమస్యలను దూరం చేస్తుంది. పైల్స్ వల్ల కలిగే నొప్పి, దురద సమస్యలు తగ్గించడంలో కొంతమేర ప్రభావం చూపుతుంది.


ఎప్పుడు తినాలి?


సాధారణంగా అరటి పండ్లను ప్రతి ఒక్కరు తినొచ్చు. గుండె జబ్బులు ఉన్నవారు కూడా రోజుకు ఒక అరటి పండు తినొచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు. ఆరోగ్య వంతులు 2-3 పండ్లు తినొచ్చని సలహా ఇస్తున్నారు.


అయితే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, ఉదయం టిఫిన్​ తర్వాత తింటే ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు నిపుణులు. పడిగడుపున అరటి పండు తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు..


ఆమ్లాలతో కూడిన పండ్లు కావడం వల్ల.. ఖాళీ కడుపుతో తినడం వల్ల.. జీర్ణ సంబంధి సమస్యలు రావచ్చని అంటున్నారు.


మంచి అరటి పండ్లను గుర్తించడం ఎలా?


దాదాపు చాలా ప్రాంతాల్లో అరటి పండ్లను దూర ప్రాంతాల నుంచి తెచ్చి విక్రయిస్తుంటారు. ఇందుకోసం కాయ దశలో ఉన్నప్పుడే వాటిని కోసి తెస్తుంటారు. అయితే రసాయానాలు వాడి వాటిని పండ్లుగా మారుస్తుంటారు చాలా మంది. ఈ పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా కూడా ఉంటాయి. అందువల్ల చాలా మంది వాటినే ఇష్టపడుతుంటారు. అయితే నిగ నిగలాడే పండ్ల జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


అరటి పండ్లపై నల్లటి మచ్చలు ఏర్పడితే అవి పూర్తిగా పక్వానికి వచ్చాయని అర్థం చేసుకోవాలి. అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని సూచిస్తున్నారు.


Also read: Healthy Tips for Skin: రోజూ స్నానం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా?


Also read: Benifits of having Beard: 'గడ్డం'తో మీకు తెలియని సీక్రెట్ హెల్త్ బెనిఫిట్స్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook