Healthy Tips for Skin: మనుషుల ఆహారపు అలవాట్లతో పాటు శుభ్రత ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శరీరానికి శక్తి కోసం కావాల్సిన ఆహారంతో పాటు శుభ్రత కూడా చాలా ముఖ్యం. అవి శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అదే విధంగా అతి ఆలోచనలు వంటివి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చుపుతాయి.
శుభ్రత విషయానికి వస్తే.. చలి కాలంలో స్నానం చేయడానికి చాలా మంది సంశయిస్తుంటారు.పెద్దగా చమట పట్టడం లేదు కదా? స్నానం చేయడం ఎందుకని భావిస్తుంటారు. కానీ స్నానం చేయడం శుభ్రత కోసం మాత్రమే కాదు! స్నానం చేయకోవడం వల్ల చర్మ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుసా? క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల అనేక రకాలుగా ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇంతకీ ఆ ఉపయోగాలేమిటో తెలుసుకుందాం.
1) చెమట ద్వారా శరీరంపై ఉండే మలినాలు.. స్వేద రంధ్రాలు మూసుకుపోయేందుకు కారణం అవుతాయి.
2) చెమట ద్వారా వచ్చే మలినాలను తొలగించేందుకు క్రమం తప్పకుండా స్నానం చేయాలి.
3) అలాంటి మలినాలను స్నానం ద్వారా తొలగించడం వల్ల స్వేద రంధ్రాల ద్వారా చెమట బయటకు వచ్చి శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి.
4) శరీర ఉష్ణోగ్రత, వాతావరణాన్ని బట్టి చన్నీళ్ల స్నానమా? వేడి నీళ్ల స్నానమా? అనేది నిర్ణయించుకోవాలి.
5) వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగు అవుతుంది.
6) రక్త ప్రసరణ మెరుగు అవ్వడం వల్ల శరీరంలోని మలినాలు త్వరగా బయటకు వెళ్లేందుకు అవకాశం ఉంది.
7) అయితే ఎక్కువ వేడి కలిగిన నీటితో స్నానం చేయడం వల్ల చర్మంపై మృదువైన తైలాలు (రక్షణ పొర) కోల్పోవాల్సి వస్తుంది.
8) అతిగా వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం వెంటనే పొడిబారి.. దురద, దద్దుర్లు వంటి బారిన పడే అవకాశం ఉంది.
9) అయితే, క్రమం తప్పకుండా స్నానం చేయడం వల్ల శరీరంలోని ఎండార్ఫిన్లు అనే పదార్థం విడుదలవుతుందని నిపుణులు చెబుతున్నారు.
10) ఆ ఎండార్ఫిన్లు అనే పదార్థం మనం ఆనందంగా ఉండేందుకు సహాయపడాతాయని అంటున్నారు.
ALso Read: Tulsi Seeds: కేన్సర్ కణాల్ని కూడా నిరోధించగలిగే విత్తనాలు..అద్భుత ప్రయోజనాలివే
Also Read: Housework Benefits: ఇంటి పనులు చేయడం వల్ల వృద్ధులకే మేలు.. జ్ఞాపకశక్తి మెరుగు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook