Knee Pain Tips: మోకాలు నొప్పులు బాధిస్తున్నాయా, పైసా ఖర్చు లేకుండా పోగొట్టవచ్చు ఇలా
Knee Pain Tips: ఇటీవలి కాలంలో మోకాలు నొప్పుల సమస్య తీవ్రమౌతూ వస్తోంది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసినా పెయిన్ కిల్లర్ మందులు వాడితే గానీ తగ్గని పరిస్థితి. అయితే కొన్ని సులభమైన టిప్స్ పాటిస్తే ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
Knee Pain Tips: మోకాలు నొప్పుల సమస్యకు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పూర్తిగా విముక్తి పొందవచ్చు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రోజూ క్రమం తప్పకుండా 4 యోగాసనాలు వేయడం అలవాటు చేసుకుంటే మోకాలు నొప్పుల నుంచి రిలీఫ్ పొందవచ్చు. మోకాళ్లను పటిష్టంగా మార్చుకోవచ్చు. దుష్పరిణామాలు కలిగించే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం కూడా ఉండదు.
మోకాలు నొప్పులు వాస్తవానికి వృద్ధుల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా యుక్త వయస్సు వారికి కూడా ఎదురౌతోంది. అధిక బరువు, దెబ్బలు తగలడం, జంగ్ ఫుడ్ దీనికి కారణం కావచ్చు. మోకాలు నొప్పులకు మార్కెట్లో వివిధ రకాల ఆయిల్స్, మందులు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇవన్నీ తాత్కాలికమే. మందులు వాడినంత వరకూ నొప్పి ఉపశమనం ఉంటుంది. కానీ యోగాసనాలతో దీర్ఘకాలం నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ యోగాసనాలు వేయడం సులభమే. పైసా ఖర్చు లేకుండా మోకాలు నొప్పులనుంచి రిలీఫ్ కావచ్చు. కేవలం మోకాలు నొప్పులు తగ్గడమే కాదు ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది.
త్రికోణాసనం Triangle Pose
త్రికోణాసనం మోకాలు కీళ్లను బలోపేతం చేస్తుంది. మోకాలు కదలికల్ని సులభతరం చేస్తుంది. ఈ ఆసనం కాళ్లు, జాయింట్స్, వెన్నెముకను స్ట్రెచ్ చేస్తుంది. దాంతో ఎలాంటి నొప్పులు ఉండవు.
పాదాంగుష్టాసనం Big Toe Pose
పాదాంగుష్టాసనం అనేది కాళ్లు, మోకాలు కండరాలను బలోపేతం చేస్తుంది. ఈ ఆసనం బ్యాలెన్సింగ్, స్ట్రెచ్, మూమెంట్ ను సులభతరం చేస్తుంది.
వృక్షాసనం Tee Pose
వృక్షాసనంలో బ్యాలెన్స్, స్థిరత్వం లభిస్తాయి. మోకాలు కీళ్లను పటిష్టం చేస్తుంది. కీళ్ల కదలికను సులభతరం చేస్తుంది. ఫలితంగా ఎలాంటి నొప్పి ఉండదు.
బాలాసనం Child Pose
బాలాసనం అనేది రిలాక్స్ అయ్యే ఆసనం. ఈ ఆసనం ద్వారా కీళ్లపై పడే ఒత్తిడి తగ్గుతుంది. ఇది వీపు, కీళ్లను స్ట్రెచ్ చేస్తుంది. దాంతో మోకాలు నొప్పులు మాయమవుతాయి.
అయితే ఎలాంటి వ్యాయామం లేదా యోగా చేసే ముందు వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్ని మోకాలు నొప్పులు ఒకేలా ఉండకపోవచ్చు. సీరియస్ కండీషన్లో ఉన్నవాటికి తక్షణ చికిత్స అవసరం అవుతుంది. అందుకే వైద్యుని సలహాతోనే యోగాసనాలు వేయడం లేదా వ్యాయామం చేయడం ఉండాలి.
Also read: LIC Best Policy: నెలకు 1369 రూపాయలు చెల్లిస్తే మెచ్యూరిటీ తరువాత 25 లక్షలు అందుకోవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook