LIC Best Policy: నెలకు 1369 రూపాయలు చెల్లిస్తే మెచ్యూరిటీ తరువాత 25 లక్షలు అందుకోవచ్చు

LIC Best Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీలో అద్భుతమైన ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైంది జీవన్ ఆనంద్ పాలసీ. ఇందులో నెలకు 14 వందలు ఇన్వెస్ట్ చేస్తే చాలు ఒకేసారి 25 లక్షలు అందుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 29, 2024, 01:33 PM IST
LIC Best Policy: నెలకు 1369 రూపాయలు చెల్లిస్తే మెచ్యూరిటీ తరువాత 25 లక్షలు అందుకోవచ్చు

LIC Best Policy: ఎల్ఐసీ దేశంలో అతి పెద్ద ఇన్సూరెన్స్ సంస్థ. ఇందులో చాలా రకాల పోలసీలు అందుబాటులో ఉంటాయి. అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కల్గించే వేర్వేరు పాలసీలున్నాయి. ఇందులో అత్యధిక ప్రాచుర్యం పొందిన పాలసీగా జీవన్ ఆనంద్ అని చెబుతారు. ఈ పాలసీ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

సేవింగ్స్, ఇన్వెస్ట్ మెంట్స్ అనేది చాలా అవసరం. భవిష్యత్తులో పెద్దమొత్తంలో డబ్బులు అవసరమైనప్పుడు ఇవే ఉపయోగపడతాయి. ఎల్ఐసీ పాలసీల్లో సేవింగ్స్ ఉంటే భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి. అందులో ముఖ్యమైంది జీవన్ ఆనంద్ పాలసీ. జీవన్ ఆనంద్ పాలసీలో డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. పాలసీదారుడు మధ్యలో చనిపోతే పాలసీ మొత్తంలో 125 శాతం లేదా వార్షిక ప్రీమియంకు 7 రెట్లు నగదు నామినీకు చెల్లిస్తారు. ఇందులో మెచ్యూరిటీపై బోనస్ కూడా ఉంటుంది. బోనస్ ప్రతి ఐదేళ్లకోసారి లభించేలా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ పాలసీలో 15 నుంచి 35 ఏళ్ల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు.

ఎల్ఐసీ అందిస్తున్న జీవన్ ఆనంద్ పాలసీలో నెలకు 1369 రూపాయలు ప్రీమియం ప్రతి నెలా చెల్లించాలి. ఇలా 35 ఏళ్లు చెల్లిస్తే మెచ్యూరిటీ తరువాత మీకు ఒకేసారి 25 లక్షల రూపాయలు చేతికి అందుతాయి. 18-50 ఏళ్ల వయస్సు కలిగిన ప్రతి భారతీయుడు ఇందులో ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రీమియం నెలకోసారి లేదా త్రైమాసికంగా లేదా ఆరు నెలలకు, ఏడాదికోసారి చెల్లించవచ్చు.

Also read: ITR Filing: ఐటీ రిటర్న్స్ కు మరో రెండు రోజులే మిగిలింది, ఏయే డాక్యుమెంట్లు అవసరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News