Apple Health Benefits: యాపిల్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన విటమిన్‌లు, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ప్రతిరోజు ఒక యాపిల్‌ పండు తినడం వల్ల శరీరానికి వివిధ రాకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందుంలో ఉండే ఫైబర్‌, యాంటీ ఆక్సిడెట్ల చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతాయి. అలాగే రక్తపోటును నియంత్రించడంలో కీలక ప్రాత పోషిస్తాయి. యాపిల్‌లో ఉండే క్వెర్సెటిస్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌ తొలగించడంలో సహాయపడుతాయి. ఇందులో ఉండే ఫైబర్‌ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యలను తొలగిస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు యాపిల్‌ను తినడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు. అలాగే ఇది కడుపు నింపిన భావనను కలిగిస్తుంది. చర్మాన్నికి కూడా యాపిల్‌ పండు ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మం పై ముడతలు, మచ్చలు రాకుండా సహాయపడుతంది. ప్రతిరోజు యాపిల్‌ తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. 


ఎవరు జాగ్రత్తగా యాపిల్ తినాలి?



యాపిల్‌లో కొంత మొత్తంలో చక్కెర ఉంటుంది కాబట్టి, షుగర్ పేషెంట్స్ తమ డాక్టర్ సలహా మేరకు మాత్రమే తినాలి. కొంతమందికి యాపిల్‌కు అలర్జీ ఉండవచ్చు. అలాంటి వారు యాపిల్ తినడం మానుకోవాలి. కిడ్నీ రాళ్లు ఉన్నవారు యాపిల్‌ను ఎక్కువగా తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది కిడ్నీ రాళ్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. యాపిల్‌లో ఉండే ఆమ్లాలు పళ్ళ ఎనామెల్‌ను దెబ్బతీయవచ్చు. కాబట్టి యాపిల్ తిన్న తర్వాత వెంటనే నీరు తాగాలి. ఏదైనా ఆహారం అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. కాబట్టి యాపిల్ కూడా మితంగా తీసుకోవడం మంచిది. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే మీ డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.


యాపిల్‌ జ్యూస్‌ తయారీ విధానం:
 
అవసరమైన పదార్థాలు:


తాజా యాపిల్స్ 
నీరు (అవసరమైతే)
చక్కెర


తయారీ విధానం:


యాపిల్స్‌ను శుభ్రమైన నీటితో బాగా కడగండి. యాపిల్స్‌ను రెండు భాగాలుగా కోసి గింజలను తీసివేయండి. యాపిల్ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కోయండి. యాపిల్ ముక్కలను బ్లెండర్ జార్‌లో వేయండి. బ్లెండర్‌ను ఆన్ చేసి, ఆపిల్ ముక్కలు మృదువుగా అయ్యే వరకు మిక్సీ చేయండి. మరింత మృదువైన జ్యూస్ కోసం, మిక్సీ చేసిన పేస్ట్‌ను గ్రేట్ చేయండి. జ్యూస్‌ను నీరు కలిపి సన్నగా చేసుకోవచ్చు. ఇష్టపడితే, చక్కెర కలిపి తీపి చేసుకోవచ్చు. తయారైన ఆపిల్ జ్యూస్‌ను గ్లాసులో పోసి వెంటనే సర్వ్ చేయండి.


చిట్కాలు:


తాజా ఆపిల్స్ ఉపయోగించండి: తాజా ఆపిల్స్ ఉపయోగించడం వల్ల జ్యూస్ రుచి మరింతగా ఉంటుంది.


Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook