Corriandor Seeds: కరోనా మహమ్మారి కష్టకాలంలో ప్రతి ఒక్కరికీ రోగ నిరోధక శక్తి ప్రాధాన్యత తెలుస్తోంది. ప్రతి వంటింట్లో ఉండే పదార్ధాలతోనే ఇమ్యూనిటీని పెంచుకోవచ్చనే విషయం మీలో ఎంతమందికి తెలుసు. ఆ వివరాలు చూద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు మందుల అవసరం లేదు. వైద్యుల చుట్టూ, హాస్పటల్స్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. కేవలం మీ వంటింట్లో లభించే అద్భుతమైన కొన్ని వస్తువులతోనే ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు. అంతేకాదు చాలా రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా ఉండే ధనియాలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు. 


ఒక స్పూన్ ధనియాలను గ్లాసు నీటిలో నానబెట్టాలి. ఓ గంట సేపు నానబెట్టిన తరువాత ఆ నీటిని క్రమం తప్పకుండా లేదా వారానికి 3-4 సార్లు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం పూట ధనియాల నీరు తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ శరీరంలో రోగ నిరోధక శక్తి గణనీయంగా పెరుగుతుంది. ధనియాల నీటిలో పుష్కలంగా లభించే యాంటీ ఆక్సిడెంట్లు..శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రిస్తాయి. ఫలితంగా పలు వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతాయి. అంతేకాకుండా ధనియాలలో పుష్కలంగా లభించే కే, సీ, ఎ విటమిన్లు జుట్టు బలంగా, వేగంగా పెరిగేందుకు అవసరమౌతాయి. ధనియాల నీటితో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ధనియాల నూనెను హెయిర్ మాస్క్‌గా అప్లై చేస్తే ఇంకా మంచిది. 


ఇక ధనియాలు జీర్ణ ప్రక్రియకు బాగా దోహదపడుతాయి. ఉదయాన్నే ప్రతిరోజూ ధనియాల నీరు తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ధనియాలలో (Corriandor) యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాల కారణంగా నల్ల మచ్చలు, మొటిమల సమస్య తగ్గుతుంది. ధనియాలతో కొలెస్ట్రాల్ కూడా అదుపులో ఉంచవచ్చని న్యూట్రిషియన్లు సూచిస్తున్నారు. ఇక అన్నింటికంటే ప్రధానమైన సమస్య డయాబెటిస్ నియంత్రణలో ధనియాల పాత్ర కీలకం. రోజూ క్రమం తప్పకుండా ధనియాలు తినడం గానీ లేదా ధనియాల నీరు తాగడం గానీ చేస్తే..ఇన్సులిన్ పరిమాణం అదుపులో ఉంటుంది. 


Also read: Tea-Biscuits: టీ, బిస్కట్ అలవాటుంటే..వెంటనే మానేయండి, లేకపోతే కలిగే అనర్దాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook