Tea-Biscuits: టీ, బిస్కట్ అలవాటుంటే..వెంటనే మానేయండి, లేకపోతే కలిగే అనర్దాలివే

Tea-Biscuits: మనకు తెలిసో తెలియకో..కొన్ని రకాల అలవాట్లు మానుకోలేం. టీ లేదా కాఫీతో బిస్కట్ అలవాటు ప్రధానమైంది. అనాదిగా చాలామందిలో కన్పించే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 5, 2022, 09:21 AM IST
 Tea-Biscuits: టీ, బిస్కట్ అలవాటుంటే..వెంటనే మానేయండి, లేకపోతే కలిగే అనర్దాలివే

Tea-Biscuits: మనకు తెలిసో తెలియకో..కొన్ని రకాల అలవాట్లు మానుకోలేం. టీ లేదా కాఫీతో బిస్కట్ అలవాటు ప్రధానమైంది. అనాదిగా చాలామందిలో కన్పించే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు

ఉదయం పూట పరగడుపున లేదా సాయంత్రం పూట స్నాక్స్ సమయంలో లేదా మద్యమధ్యలో చాలామందిలో సర్వ సాధారణంగా కన్పించే అలవాటు టీ బిస్కట్. ఇది అనాదిగా వస్తున్న ఓ కాంబినేషన్ రెసిపీ అని చెప్పవచ్చు. తెలిసో తెలియకో అందరి ఆహారపు అలవాట్లలో ఇదొక భాగమైపోయింది. అయితే ఈ అలవాటు మంచిదా కాదా అనేది ఇప్పుడు ప్రశ్న. మీకు కూడా టీ లేదా కాఫీతో పాటు బిస్కట్లు తినే అలవాటు ఉంటే..వెంటనే మానేయడం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. టీ బిస్కట్ కాంబినేషన్ రెసిపీ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు. ఈ రెండూ కలిపి తీసుకుంటే కలిగే దుష్పరిణామాలు చాలా ఎక్కువంటున్నారు. అందుకే మానేయమంటున్నారు వైద్యులు. 

బిస్కట్‌లో హైడ్రోజెనెటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. బిస్కట్ అనేది ఎప్పుడూ ఫ్యాట్ లేకుండా ఉండదు. అందుకే దీర్ఘకాలం బిస్కట్లు తింటే ఆరోగ్యానికి మంచిది కాదు..ఫలితంగా లావెక్కే ప్రమాదముందంటున్నారు నిపుణులు. ఎక్కువకాలం టీ లేదా కాఫీతో తీపి బిస్కట్లు తింటే బ్లడ్ సుగర్ స్థాయి పెరుగుతుంది. అంతేకాకుండా సోడియం స్థాయి పెరుగుతుంది. డయాబెటిస్, థైరాయిడ్ రోగులు బిస్కట్ అస్సలు తినకూడదు. బిస్కట్‌లో అధికంగా ఉండే షుగర్ కారణంగా రోగ నిరోధకశక్తి తగ్గిపోతుంది. 

బిస్కట్‌ను రిఫైండ్ పిండితో తయారు చేస్తారు. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండదు. ఫలితంగా బిస్కట్లు ఎక్కువ తినడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. అదే సమయంలో బిస్కట్ లేదా కుకీస్‌లో బీహెచ్‌టీ పేరున్న రెండు ప్రిజర్వేటివ్‌లు వేస్తారు. ఇది ఆరోగ్యానికి నష్టం చేకూరుస్తుంది. బిస్కట్ తయారయ్యేది మైదా పిండితో. మైదా పిండిని వైట్ పాయిజన్‌గా కూడా పిలుస్తుంటారు. బిస్కట్‌లో షుగర్ స్థాయి చాలా ఎక్కువగానే ఉంటుంది. రోజూ బిస్కట్లు తినడం వల్ల పళ్లకుండే ఎనామిల్ దెబ్బతింటుంది. దాంతో దంతాల కేవిటీ క్షీణిస్తుంది. 

Also read: Fatigue: ఆహారపు అలవాట్లు ఇలా మార్చుకుంటే చాలు, అలసట దూరం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News