Blood Group vs Heart Risk: ఆధునిక పోటీ ప్రపంచంలో, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా హార్ట్ ఎటాక్ సమస్య సర్వ సాధారణంగా కన్పిస్తోంది. వాస్తవానికి హార్ట్ ఎటాక్ ముప్పు..మీ బ్లడ్ గ్రూప్‌ను బట్టి కూడా ఉంటుందనేది చాలా మందికి తెలియదు. అదేంటో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హార్ట్ ఎటాక్. మనిషిని అత్యంత భయపెట్టే వ్యాధి. ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న ప్రమాదం. హార్ట్ ఎటాక్ ముప్పు అనేది సహజంగా  అస్తవ్యస్థమైన లైఫ్‌‌స్టై‌ల్, ఆహారపు అలవాట్ల కారణంగా వస్తుంటుంది. మారుతున్న జీవనశైలితో పాటు సాధారణంగా ఆరోగ్యంపై దృష్టి పెట్టరు. ఫలితంగా తక్కువ వయస్సులోనే గుండెపోటుకు గురవుతుంటారు. గుండెపోటుతో ప్రాణాలు పోయే పరిస్థితులు చాలా ఎక్కువ. అయితే అదే సమయంలో కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్‌ని బట్టి కూడా సంబంధిత వ్యక్తుల్లో హార్ట్ ఎటాక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే మీ బ్లడ్ గ్రూప్‌ని బట్టి మీలో గుండెపోటు సమస్య ఎంతవరకూ ఉంటుందో తెలుసుకుందాం..ఏ బ్లడ్ గ్రూప్ వారికి గుండెపోటు సమస్య తక్కువనేది కూడా చూద్దాం..


హార్ట్ ఎటాక్ ముప్పు ఎక్కువగా ఉండే గ్రూప్‌లు


దీనిపై చాలా అధ్యయనాలే జరిగాయి. ఆ అధ్యయనాల ప్రకారం ఏ, బీ బ్లడ్ గ్రూపువారికి థ్రోంబోసిస్ అయ్యే ప్రమాదం ఎక్కువ. థ్రోంబోసిస్ అంటే రక్తనాళాలు లేదా ధమనులు కుదించుకుపోయే స్థితి. ఫలితంగా రక్తాన్ని సరఫరా చేసేందుకు గుండెపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా చాలా రకాల సమస్యలు ఎదురౌతాయి.


గుండెపోటు సమస్య తక్కువగా ఉండే బ్లడ్ గ్రూప్


ఇక మరో ముఖ్యమైనది, యూనివర్శల్ బ్లడ్ డోనర్‌గా పిలువబడే ఓ గ్రూప్. ఈ గ్రూప్ వారికి గుండెపోటు ముప్పు చాలా తక్కువ. అయితే ఇదేమీ నిర్ధారణ కాలేదు. అయితే ఈ గ్రూప్ ప్రజానీకం తమ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే మారుతున్న జీవనశైలిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతూ..హార్ట్ ఎటాక్ ముప్పును తెచ్చిపెడుతున్నాయి.


మరేం చేయాలి


అన్నింటికంటే ముఖ్యమైంది  సమయానికి నిద్రపోవడం, సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఈ అలవాటు చాలా రుగ్మతలకు కారణం. దీంతోపాటు మీ ఆహారపు అలవాట్లపై కూడా దృష్టి సారించాలి. హార్ట్ ఎటాక్ రిస్క్‌ను తగ్గించే పండ్లు, కూరగాయల్ని సాధ్యమైనంతవరకూ డైట్‌లో చేర్చుకుంటే మంచిది. మీ బ్లడ్ గ్రూప్ అనుకూలంగా లేకపోయినా..మీమీ ఆహారపు అలవాట్లు, జీవనశైలి ద్వారా గుండెపోటు ముప్పును కచ్చితంగా తగ్గించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.


Also read: Insomnia: రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా..నిద్రలేమి సమస్య వెంటాడుతోందా, ఇలా చేయండి చాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook